wardhannapeta
-
ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళ మృతి
సాక్షి, వర్ధన్నపేట (వరంగల్) : ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం అయిన మహిళకు వైద్యం వికటించి మృతి చెందిందని ఆరోపిస్తూ గురువారం సాయంత్రం మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం వరంగల్– ఖమ్మం ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగా రు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం సిద్ధ సముద్రంకు చెందిన దారావత్ దివ్య బుధవారం ప్రసవం కోసం కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆమెకు నొప్పులు రావడంతో దివ్యకు బుధవారం రాత్రి ఆపరేషన్ చేయగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మరికొద్ది గంటల్లోనే రక్తస్రావం కావడంతో వెంటనే ఆమెను వైద్యులు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. దివ్య ఎంజీఎంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందిం ది. దీంతో దివ్య మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట, వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి పై ఆందోళనకు దిగారు. దీంతో ఇరువైపుల కిలో మీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే స్థానిక ఎస్సై బండారి సంపత్ సిబ్బందితో అక్కడకు చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడారు. దీంతో వారు ఎస్సైతో వాగ్వివాదానికి దిగారు. వారికి నచ్చజెప్పి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
వర్ధన్నపేట టీజేఎస్ ప్రచారంలో తేనెటీగల దాడి
సాక్షి, వర్ధన్నపేట: మండలంలో శుక్రవారం మహాకూటమి బలపరిచిన టీజేఎస్ అభ్యర్థి డాక్టర్ పగిడపాటి దేవయ్య ప్రచార పర్వంలో నల్లబెల్లి శివారు గుంటూరుపల్లి వద్ద భోజన సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే వర్ధన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఓ బాలుడి ముఖంపై కుట్టడంతో తీవ్ర అ స్వస్థతకు గురయ్యాడు. కాగా ఆ బాలుడిని వరంగల్‌లోని ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం ప్రచారంలో భాగంగా చెన్నారం, కాషగూడెం, నల్లబెల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించి మధ్యాహ్నం సమయంలో నల్లబెల్లి శివారు గుంటరుపల్లిలో ఓ షెడ్డులో భోజనాలు చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న తేనెటీగలు దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. ఐనవోలు మాజీ చైర్మన్ చంద్రారెడ్డితో పాటు ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ పరమార్శించారు. -
స్కూల్ బస్సును ఢీకొన్న లారీ..!
సాక్షి, వరంగల్ : ప్రైవేటు స్కూల్ బస్సును వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టిన ఘటన వరంగల్ జిల్లా వర్థన్నపేటలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమింది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న లారీ డ్రైవర్ ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40మంది విద్యార్థులు ఉన్నారు. లారీ ఢీ కొట్టడంతో విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురైయ్యారు. గాయాలపాలైన విద్యార్థులను వరంగల్‌లోని ఎంజీఎంకు తరలిస్తున్నారు. బస్సు డీసీ తండా నుంచి వర్ధన్నపేటలోని స్కూల్‌కి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు బోల్తా.. ప్రకాశం : విద్యార్థులను తీసుకుని పాఠశాలకు వెళ్తున్న ప్రైవేలు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని పొదిలి మండలం కాటురిపాలెం వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది విద్యార్థులు ఉన్నారు. -
వర్ధన్నపేట జిల్లా చేయాలి
వర్ధన్నపేట టౌన్ : వర్ధన్నపేటను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ స్థానిక వరంగల్–ఖమ్మం రహదారిపై కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం సుమారు గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ.. వర్ధన్నపేట జిల్లా ప్రకటించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు. హన్మకొండ జిల్లా ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని భౌగోళికంగా, పరిపాలనపరంగా ఆలోచించి వర్ధన్నపేటను ప్రకటించాలని డిమాండ్ చేశారు. మహబూబాద్, భూపాలపల్లి జిల్లాలు సబబుగానే ఉన్నా.. ఎవరూ కోరని హన్మకొండను జిల్లాగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హన్మకొండను వరంగల్ నుంచి వేరు చేయడం సమంజసం కాదన్నారు. వర్ధన్నపేట జిల్లా కోసం జేఏసీగా ఏర్పడి ఆందోళన కార్యక్రమా లు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఐ ఆదినారాయణ సిబ్బందితో వచ్చి ఆందోళనకారులను అరెస్టు చేసి, తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో ముత్తిరెడ్డి కేశవరెడ్డి, వడిచర్ల శ్రీనివాస్, రాయపురం సాంబయ్య, నరుకుడు వెంకటయ్య, సట్ల కుమారస్వామి, గుజ్జ కమలాకర్‌రావు, కొండే టి సత్యం, వడ్లకొండ ఎల్లగౌడ్, బందెల నాగార్జున్, బచ్చు గంగాధర్‌రావు పాల్గొన్నారు.