బస్సు డ్రైవర్‌ను పరీక్షిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
బంజారాహిల్స్: మద్యం మత్తులో స్కూల్ బస్సు నడుపుతున్న డ్రైవర్‌ను ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రముఖ విద్యాసంస్థలో బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్న సుబ్బారావు(54) మంగళవారం సాయంత్రం మాసబ్‌ట్యాంక్‌లో ఓ విద్యార్థినిని వదిలిపెట్టి మరో విద్యార్థినిని పంజగుట్టలో వదిలేందుకు వెళ్తున్నాడు. మాసబ్‌ట్యాంక్ చౌరస్తాలో సిగ్నల్ జంప్ చేయడంతో అనుమానం వచ్చిన ఆసిఫ్‌నగర్ ట్రాఫిక్ పోలీసులు అతడిని వెంబడించారు.
బస్సును ఆపి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా అతను మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. 235 బీఏసీ నమోదు కావడం గమనార్హం. గతంలోనూ అతను ఎస్‌ఆర్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో బస్సు నడుపుతూ పట్టుబడగా అప్పుడు 188 బీఏసీ స్థాయిగా నమోదైంది. 2017 ఆగస్టు 17న డ్రంక్ అండ్ డ్రైవ్‌లో రెండు రోజుల శిక్ష అనుభవించినట్లు తేలింది. తాజా ఘటనలో ఆసిఫ్‌నగర్ ట్రాఫిక్ సీఐ సైదులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment