
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ బెంగుళూరు హైవే పై స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. సాతంరాయి వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీ కొట్టింది.
గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సుతో పాటు డ్రైవర్ ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments
Please login to add a commentAdd a comment