
సాక్షి, విజయనగం : జిల్లాలోని కొమరాడ మండలం అర్థం గ్రామ శివారులో బుధవారం నారాయణ స్కూల్ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవైపు వర్షం పడుతున్నా 32 మంది పిల్లలతో బయల్దేరిన బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టి నేరుగా పక్కనే ఉన్న చెరుకు తోటలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలోలో పిల్లలు సురక్షితంగా బయటపడ్డా, డ్రైవర్‌కు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బస్సులో కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ స్కూల్ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment