
జవహర్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. జవహర్ నగర్ పిఎస్ పరిధిలో ఆనంద్ నగర్ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో ఘటన జరిగింది..
సాక్షి, హైదరాబాద్: జవహర్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. జవహర్ నగర్ పీఎస్ పరిధిలో ఆనంద్ నగర్ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో ఘటన జరిగింది..
సోదరుడికి తోడుగా స్కూల్ బస్సు వద్దకు వచ్చిన చిన్నారి భవిష్య.. ప్రమాదవశాత్తు రచన గ్రామర్ హైస్కూల్ బస్సు ముందు చక్రాల కింద పడింది. బస్సు డ్రైవర్ ప్రవీణ్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.