
ధర్మశాల : హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం ఘోర ప్రమాదం సంభవించింది. కంగ్రా జిల్లా నూర్‌పూర్ ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 27 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఘటనలో మరికొందరు విద్యార్థులకు గాయాలు కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మృతులంతా 10ఏళ్ల లోపు చిన్నారులే.
వజీర్ రామ్ సింగ్ పథానియా స్కూల్‌కు చెందిన బస్సు విద్యార్థులను ఇంటి వద్ద దింపేందుకు వెళ్తోంది. హఠాత్తుగా అదుపుతప్పిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది. లోయ 100 మీటర్ల లోతు ఉండటంతో సహయక చర్యలకు విఘాతం కలుగుతోంది. ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు రంగంలోకి దిగగా.. వారికి స్థానికులు కూడా సాయం చేస్తున్నారు. కాగా, ఘటన సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నట్లు స్కూల్ యాజమాన్యం చెబుతోంది. ఇప్పటిదాకా 27 మృతదేహాలను వెలికి తీసినట్లు విద్యాశాఖ మంత్రి సురేష్ భరద్వాజ్ ప్రకటించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment