మహబూబ్‌నగర్ క్రైం : బోల్తాపడిన బస్సు
మహబూబ్‌నగర్ క్రైం: డ్రైవర్ అతివేగం.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల అభంశుభం తెలియని పాఠశాల విద్యార్థులు గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాకేంద్రం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. రూరల్ ఏఎస్‌ఐ బాలబ్రహ్మం కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని ఆకృతి పాఠశాలకు చెందిన బస్సు గురువారం మహబూబ్‌నగర్ నుంచి 30 మంది విద్యార్థులను ఎక్కించుకుని కొయిలకోండ మండలం అవంగపట్నం గ్రామానికి వెళ్తుంది. ఈ క్రమంలో మార్గమధ్యలో భవాని సాగర్ సమీపంలో ము ందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టెక్ చేయబోయి అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న 30 మంది విద్యార్థు ల్లో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వా రిని స్కూల్ యాజమాన్యం వారి వారి ఇళ్లకు పంపించారు.
ఉపాధ్యాయుడికి గాయాలు
మల్దకల్ (గద్వాల): విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న ఓ ఉపాధ్యాయుడు అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మేకలసోంపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుగా పనిచేస్తున్న ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గురువారం పాఠశాల నుంచి విధులు ముగించుకుని గద్వాలకు వెళ్తుండగా మార్గమధ్యలో ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేయి విరిగింది. వెంటనే తోటి ఉపాధ్యాయులు గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ సమీపంలోని ఏనుగొండ ఎస్‌వీఎస్ ఆస్పత్రికి రెఫర్ చేశారు.
కారు బోల్తా : మహిళకు తీవ్రగాయాలు
పెబ్బేరు (కొత్తకోట): కారు బోల్తా పడటంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన పెబ్బేరులోని బాలాజీ దాబా వద్ద జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. డాక్టర్ గిరిజ అనే మహిళ హైదరాబాద్ నుంచి కారులో కర్నూలు వెళ్తుండగా పెబ్బేరు సమీపంలో బాలాజీ దాబా దగ్గర అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆమె కుడిచేయి విరగగా స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment