తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్పం మండలం మునిపల్లి గ్రామ శివారులోని రొయ్యల చెరువు కోసం తవ్వి వదిలేసిన బోర్‌వెల్ నుంచి మంటలు ఎగసిపడతుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఉప్పలగుప్పం (తూర్పు గోదావరి) : తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్పం మండలం మునిపల్లి గ్రామ శివారులోని రొయ్యల చెరువు కోసం తవ్వి వదిలేసిన బోర్‌వెల్ నుంచి మంటలు ఎగసిపడతుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. 4 సంవత్సరాల క్రితం తవ్వి వదిలేసిన ఈ బోర్‌వెల్ వినియోగంలో లేకపోవడంతో చెరువుల యజమానులు దీన్ని పూడ్చకుండా వదిలేశారు.
గత కొంతకాలంగా ఈ బోరు నుంచి నీరు పైకి ఉబికి రావడం మొదలైంది. అయితే శుక్రవారం మాత్రం నీటితో పాటు మంటలు కూడా వస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఓఎన్‌జీసీ అధికారులకు సమాచారం అందించారు.