బోరుబావిలో రెండేళ్ల చిన్నారి!
లక్నో: ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. కాన్పూర్ లో రెండేళ్ల చిన్నారి 25 అడుగుల లోతున్న బోరు బావిలో పడిపోయింది. స్థానికంగా ఈ విషయం కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఆర్మీ అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు బోరు బావి స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జేసీబీలతో బోరుబావి పక్కన సమాంతరంగా తవ్వకం పనులు వేగంగా జరుగుతున్నాయి.
బోరుబావిలో పడ్డ బాలికకు అధికారులు పైపుల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. బోరుబావి గుంతను మళ్లీ మట్టితో పూడ్చకపోవడం, పై భాగంలో ఎలాంటి ప్రమాద హెచ్చిరికలు లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగి ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.