మరో చిన్నారి బోరు బావిలో పడిపోయింది. కర్ణాటకలోని బీజాపూర్‌లో నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ బోరువెల్‌లో పడిపోయింది.
బెంగళూరు : మరో చిన్నారి బోరు బావిలో పడిపోయింది. కర్ణాటకలోని బీజాపూర్‌లో నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ బోరువెల్‌లో పడిపోయింది. పాపను బయటకు తీసేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. కానీ గంటలు గడుస్తున్నా .. ఇంతవరకూ ఫలితం మాత్రం కనిపించలేదు. దీంతో తమ బిడ్డ కోసం తల్లిదండ్రులు ఆదుర్ధా పడుతున్నారు. ఎలాగైనా తమ కంటిపాపను బైటికి తీసుకురావాలని ప్రాధేయపడుతున్నారు. బోరు బావుల్లో చిన్నారులు పడిపోయి ప్రాణాలు కోల్పోయే ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి, హెచ్చరికలు చేస్తున్నా ఫలితం మాత్రం ఉండటం లేదు.