చత్తాపూర్(మధ్యప్రదేశ్):14 నెలల పసి బాలుడు వంద అడుగుల బోరు బావిలో పడిన ఘటన చత్తాపూర్ జిల్లాలోని లిధోరా గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం పొలంలో ఆడుకుంటూ ఆకస్మాత్తుగా బోర్ బావిలో పడినట్లు జిల్లా అధికారులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటికే ఆరంభించామన్నారు. 18 అడుగుల లోపు ఆ బాలుడు చిక్కుకుని ఉండవచ్ని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ రవీంద్ర చుక్సే తెలిపారు.
దీనిలో భాగంగా ఆ మార్గం గుండా వెళ్లే రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు.ఘటనా స్థలికి చేరుకున్న వైద్య బృందం ఒక గొట్టం ద్వారా ఆ బాలునికి ఆక్సిజన్ అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. గతంలో నీరు లేనందున బోర్ బావిని మూసివేశామని.. అయినా ఆ పొలం యజమాని తిరిగి దాన్ని ఓపెన్ చేయడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని చుక్సే తెలిపారు.