వినుకొండ: గుంటూరు జిల్లాలో బోరు బావిలో పడిన బాలుడు చంద్రశేఖర్ ప్రాణాలతో తిరిగొచ్చాడు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి చిన్నారిని బోరు బావి నుంచి బయటకు తీయగానే తల్లితండ్రులతో పాటు స్థానికులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. చిన్నారి చందు పేరెంట్స్‌ను మీడియా సంప్రదించగా మొదట వారికి ఈ సంతోషంలో నోట మాట రాలేదు. తమ కుమారుడిని మళ్లీ ప్రాణాలతో చూసే సరికి వారు షాక్‌కు గురయ్యారు.
కుమారుడి పరిస్థితి గమనించి అంతా క్షేమమని తెలుసుకున్నాక బాలుడి తల్లి అనూష మాట్లాడుతూ.. మంగళవారం సాయంత్రం పొలానికి వెళ్లగా మా బాబు బోరు బావిలో పడిపోయాడు. అయితే దాదాపు 11 గంటల పాటు శ్రమించి సహాయక సిబ్బంది మా బాబును ప్రాణాలతో కాపాడినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు అంటూ ఆమె హర్షం వ్యక్తంచేశారు. మా కొడుకు క్షేమంగా తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని చందు తండ్రి మల్లికార్జున్ అన్నాడు. బాబును బయటకు తీసేందుకు యత్నించిన వారితో పాటు బాబు ప్రాణాలతో బయటకు రావాలని కోరుకున్న అందరికీ పేరు పేరునా ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.
సంతోషంతో నోట మాట రాలేదు..
Published Wed, Aug 16 2017 4:02 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement