అక్టోబర్ రెండో వారంలో వచ్చిన తిత్లీ తుఫాను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. పంట పొలాలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా తాగునీరు కలుషితమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిలో కొందరికి సురక్షిత మంచి నీరు అందించేందుకు హీరో అల్లు అర్జున్ ముందుకొచ్చారు. మండస, వజ్రకొట్టూరు మండలాల్లోని కొండలోగం, దేవునలతడ, అమలపాడు, పొల్లాడి గ్రామాలకు సురక్షిత మంచి నీరు అందించేందుకు ఆయన 3ఆర్వో (రివర్స్ ఆస్మాసిస్) వాటర్ ప్లాంట్స్, ఒక బోర్‌వెల్ వేయించేందుకు ముందుకు వచ్చారు. మరో 15 రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా ఆయా గ్రామాల్లోని దాదాపు 3000 మందికి సురక్షిత మంచి నీరు అందనుంది. సురక్షిత మంచి నీరు అందిస్తున్నందుకు ఆయా గ్రామాల ప్రజలు అల్లు అర్జున్‌కి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment