'తండేల్'(Thandel) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఈమేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న భారీ అంచనాలతో విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫిబ్రవరి 1 శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరుపుతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ (Allu Arjun) వస్తుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు. అయితే, చివరి క్షణంలో ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 'ది ఐకానిక్ తండేల్ జాతర'ను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఒక పోస్టర్‌ను సోషల్‌మీడియాలో మేకర్స్ విడుదల చేశారు. అయితే, ఆదివారం నాడు ఈ కార్యక్రమం ఘనంగా జరుపుతామని తెలిపారు. ఈ పాలి యాట గురితప్పేదే లేదంటూ సినిమా డైలాగ్‌ను కూడా అందులో చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment