RO plants
-
ఇక సోలార్ వాటర్ ఏటీఎంలు
సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో సోలార్ వాటర్ ఏటీఎంలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి ఆర్వో ప్లాంట్ల కంటే నాణ్యమైన తాగునీటిని అందించనున్నాయి. విద్యుత్ అవసరం లేకుండా కేవలం సౌర శక్తితోనే ఇవి పనిచేస్తాయి. వీటి ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్ క్యాప్) ముందుకొచ్చింది. ఈ పరిజ్ఞానం కావలసిన వారి నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)ను ఆహ్వానిస్తోంది. సోలార్ వాటర్ ఏటీఎంలపై స్మార్ట్ సిటీల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది. స్మార్ట్ సిటీలు, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల కార్యాలయాలు, ఆలయాలు, పార్కులు, బస్టాండ్లు, ఆస్పత్రుల్లో వాటర్ ఏటీఎంల ఏర్పాటుకు అనువుగా ఉంటాయని భావిస్తున్నారు. ఒడిశాలోని కోణార్క్ స్మార్ట్ సిటీ సూర్య దేవాలయంలో సోలార్ ఏటీఎంలను పెట్టారు. అక్కడ విజయవంతంగా నడుస్తుండటంతో మన రాష్ట్రంలోనూ వీటిని ప్రవేశపెట్టడానికి నెడ్‌క్యాప్ ముందుకొచ్చింది. పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లో అయితే మునిసిపల్ వాటర్ పైప్లైన్లను వీటికి కనెక్ట్ చేస్తారు. ఆ నీటిని స్టోరేజీ ట్యాంకులో నిల్వ చేసి ప్యూరిఫై చేస్తారు. తిరుపతి స్మార్ట్ సిటీ ఆసక్తి సోలార్ స్మార్ట్ వాటర్ ఏటీఎంలపై తిరుపతి స్మార్ట్ సిటీ ఆసక్తి కనబరుస్తోంది. రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, కార్పొరేషన్లకు తమ వద్ద ఉన్న సోలార్ వాటర్ ఏటీఎంల పరిజ్ఞానంపై సమాచారం ఇస్తున్నట్టు నెడ్‌క్యాప్ జనరల్ మేనేజర్ (టెక్నికల్) జగదీష్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఆసక్తి వ్యక్తీకరణకు ఆహ్వానం రాష్ట్రంలో సోలార్ స్మార్ట్ వాటర్ ఏటీఎం ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణకు (ఈఓఐ) నెడ్‌క్యాప్ తాజాగా ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న వారు తమ బిడ్లను అక్టోబర్ 8వ తేదీ లోగా దాఖలు చేయాలని పేర్కొంది. 11వ తేదీన టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్లను తెరవనున్నారు. డబ్బు చెల్లిస్తే నీళ్లొస్తాయి గూగుల్/ఫోన్‌పే ద్వారా సరిపడిన మొత్తాన్ని చెల్లించి సోలార్ వాటర్ ఏటీఎంల నుంచి నీటిని పొందవచ్చు. 250 ఎంఎల్, లీటరు, 10 లీటర్ల పరిమాణంలో నీటిని తీసుకునే వీలుంటుంది. సోలార్ ఏటీఎంల్లో నార్మల్ వాటర్‌తో పాటు కూలింగ్ చేసే చిల్లర్లు కూడా ఉంటాయి. బటన్ నొక్కి ఏ నీరు కావాలనుకుంటే ఆ నీరు పొందవచ్చు. ఇవి గంటకు 500 లీటర్ల నీటినిచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నీటిలో ఫ్లోరైడ్‌ను తొలగించగలిగే పరిజ్ఞానం ఈ ఏటీఎంలలో ఉంటుంది. వీటిలో అల్ట్రా ఫిల్టరేషన్ యూనిట్లు ఉంటాయి. పైగా వీటి నుంచి వచ్చే నీటిలో నాణ్యతా ప్రమాణాలు డిస్ప్లే అవుతాయి. ప్యూరిఫై చేయడంలో నెడ్‌క్యాప్ పరిజ్ఞానంతో తయారైన సోలార్ ఏటీఎంలో నీరు ఆర్వో ప్లాంట్లకంటే నాణ్యత కలిగి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
ఇంట్లో తాగునీటి శుద్ధి–నిల్వపై ఫిబ్రవరిలో చర్చాగోష్టి
ఆర్.ఓ. పద్ధతిలో శుద్ధి చేసిన నీటిని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్న నేపథ్యంలో జాతీయ గ్రామీణాభివృద్ధి–పంచాయతీరాజ్ సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్.), ఎస్.ఎం.సెహగల్ ఫౌండేషన్లు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాడుకలో ఉన్న మెరుగైన ‘ఇంటి స్థాయిలో తాగునీటి శుద్ధి– నిల్వ పద్ధతుల’పై అనుభవాలను పంచుకునేందుకు, జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఫిబ్రవరి 27–28 తేదీల్లో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్.లో చర్చాగోష్టి జరగనుంది. కెనడాకు చెందిన సెంటర్ ఫర్ అఫార్డబుల్ వాటర్ శానిటేషన్ టెక్నాలజీ ఈ వర్క్‌షాపునకు నాలెడ్జ్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. నీటిశుద్ధి–నిల్వ సాంకేతికతల డెవలపర్లు, టెక్నాలజీ ప్రొవైడర్లు, వీటిని అనుసరిస్తున్నవారు తమ అనుభవాలను పంచుకోవచ్చు, మెరుగుపరుచుకోవచ్చు. తాము వాడుతున్న ప్యూరిఫయ్యర్లను ప్రదర్శించవచ్చు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు/పోస్టర్లను చూపించి చర్చలో పాల్గొనవచ్చు. ఆసక్తి గల వారు ఫిబ్రవరి 7లోగా వివరాలు పంపాలి. వివరాలకు.. అపరాజిత–98012 73123. Email: a.vaibhav@smsfoundation.org మార్చిలో జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు జాతీయ శాశ్వత వ్యవసాయ(పర్మాకల్చర్) మహాసభ సంగారెడ్డి జిల్లా (జహీరాబాద్ సమీపంలోని) బిడకన్నె గ్రామంలోని వ్యవసాయ శిక్షణా క్షేత్రంలో జరగనుంది. ‘భూతాపోన్నతి – శాశ్వత వ్యవసాయ పరిష్కారాలు’ అనే అంశంపై ఈ మహాసభలో విస్తృత చర్చ జరుగుతుంది. పర్యావరణపరమైన సుస్థిరతను అందించే రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పత్తి సాధనకు దోహదపడే జీవవైవిధ్య, ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు ఈ మహాసభ వేదిక కానుంది. రిజిస్ట్రేషన్ తదితర సమాచారం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 75697 20601. E-mail id : aranyahyd@gmail.com చిరుధాన్య వంటకాలపై 18న ఐ.ఐ.ఎం.ఆర్.లో శిక్షణ వర్షాధారంగా పండే చిరుధాన్యాలలో సకల పోషకాలు ఉన్నాయి. వీటిని మూలాహారంగా తీసుకుంటే జీవనశైలి వ్యాధులు సైతం నయం అవుతాయి. అయితే, వీటితో సంప్రదాయ వంటకాలతో పాటు ఆధునిక వంటకాలను కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు అని హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థ–ఐ.ఐ.ఎం.ఆర్. (కేంద్ర ప్రభుత్వ సంస్థ) చెబుతోంది. చిరుధాన్య వంటకాల తయారీపై కుకింగ్ విత్ మిల్లెట్స్ పేరిట గృహిణులు, హోటళ్ల నిర్వాహకులు, స్టార్టప్ సంస్థల వ్యవస్థాపకులకు ఈ నెల 18(శనివారం)న ఐ.ఐ.ఎం.ఆర్.లోని న్యూట్రిహబ్ శిక్షణ ఇవ్వనుంది. ఫీజు రూ. 1,500. పేర్ల రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం.. nutrihubtbi@gmail.com 040-24599379/ 29885838 / Mobile - 9490476098 www.millets.res.in / www.nutrihub-tbi-iimr.org మట్టి ద్రావణంతో చీడపీడల నివారణపై 19న శిక్షణ ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ క్షేత్రాల్లో మట్టి ద్రావణంతో వివిధ పంటల్లో చీడపీడల నివారణ పద్ధతులపై ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త, మట్టి ద్రావణ ంపై పేటెంట్ పొందిన చింతల వెంకటరెడ్డి ఈ నెల 19(ఆదివారం)న గుంటూరు జిల్లా కొర్నెపాడులోని తమ శిక్షణా కేంద్రంలో రైతులకు శిక్షణ ఇస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ముందుగా పేర్లు నమోదుకు సంప్రదించాల్సిన నంబర్లు.. 97053 83666, 0863–2286255. 22న విజయవాడలో మామిడి రైతులకు శిక్షణ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఈనెల 22(శుక్రవారం)న విజయవాడ పడమట లంకలోని రైతు శిక్షణా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగుపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు శిక్షణ ఇస్తారు. భోజన సదుపాయం ఉంది. విజయవంతంగా సాగు చేస్తున్న రైతులు పాల్గొని ఇతర రైతులతో అనుభవాలను పంచుకోవలసిందిగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం కోరుతోంది. వివరాలకు.. జగదీష్ – 78934 56163. 29న చోహన్ క్యు, సీవీఆర్ సాగు పద్ధతులపై శిక్షణ రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం రిక్వెల్ ఫోర్డ్ ఇంటర్ నేషనల్ స్కూల్ వద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 29న ఉ. 9 గం. నుంచి సా. 6 గం. వరకు డా. చోహాన్ క్యు(దక్షిణ కొరియా) ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై నిపుణురాలు, ‘సర్ర’ డైరెక్టర్ రోహిణీ రెడ్డి (బెంగళూరు), మట్టి సేద్యం ఆవిష్కర్త చింతల వెంకట రెడ్డి(హైదరాబాద్) రైతులకు శిక్షణ ఇస్తారని న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివ షిండే తెలిపారు. చోహన్‌క్యు పద్ధతిపై తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన పరిశోధనా ఫలితాలను అధ్యాపకులు తెలియజేస్తారు. చోహన్‌క్యు రూపొందించిన ఫెయిత్ (ఫుడ్ ఆల్వేస్ ఇన్ ద హోమ్) బెడ్ తయారీ పద్ధతిలో కూరగాయల సాగుపై ప్రత్యక్ష శిక్షణ ఇస్తారు. భోజన సదుపాయం ఉంది. ఆసక్తి గల రైతులు ఈ నెల 20 లోగా రూ. 200 చెల్లించి ముందాగా పేర్లు నమోదు చేయించుకోవాలి. వివరాలకు.. సంపత్‌కుమార్ – 98854 55650, నీలిమ – 99636 23529. -
నీటి సాయం
అక్టోబర్ రెండో వారంలో వచ్చిన తిత్లీ తుఫాను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. పంట పొలాలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా తాగునీరు కలుషితమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిలో కొందరికి సురక్షిత మంచి నీరు అందించేందుకు హీరో అల్లు అర్జున్ ముందుకొచ్చారు. మండస, వజ్రకొట్టూరు మండలాల్లోని కొండలోగం, దేవునలతడ, అమలపాడు, పొల్లాడి గ్రామాలకు సురక్షిత మంచి నీరు అందించేందుకు ఆయన 3ఆర్వో (రివర్స్ ఆస్మాసిస్) వాటర్ ప్లాంట్స్, ఒక బోర్వెల్ వేయించేందుకు ముందుకు వచ్చారు. మరో 15 రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా ఆయా గ్రామాల్లోని దాదాపు 3000 మందికి సురక్షిత మంచి నీరు అందనుంది. సురక్షిత మంచి నీరు అందిస్తున్నందుకు ఆయా గ్రామాల ప్రజలు అల్లు అర్జున్‌కి ధన్యవాదాలు తెలిపారు. -
జవాన్లకు 10 వేల కళ్లద్దాలు విరాళం ఇచ్చిన వ్యాపారులు
గుజరాత్: సూరత్, గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారులు బీఎస్ఎఫ్ జవాన్లకు 10 వేల కళ్లజోళ్లు, ఆర్వో వాటర్ మిషన్లు, ఈసీజీ తదితర పరికరాలు పంపిణీ చేశారు. ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులో ఎండ ఎక్కువగా ఉండటం వల్ల దాని నుంచి ఉపశమనం కల్పించేందుకు జవాన్లకు అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హజరయ్యారు. గుజరాత్ హోం మంత్రి హరిబాయ్ పార్థిబాయ్ చౌదరి అభ్యర్థన మేరకు వీటిని ఇవ్వడం హర్షణీయం అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. -
పేదబస్తీలకు ఫిల్టర్ వాటర్
4 రూపాయలకే 20 లీటర్లు.. 400 నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు యోచన.. తొలి దశలో 60 కేంద్రాలు త్వరలో ప్రారంభించనున్న జీహెచ్ఎంసీ సాక్షి, హైదరాబాద్: గుక్కెడు మంచినీటి కోసం అల్లాడుతున్న నగరంలోని పేదబస్తీ వాసులకు త్వరలో మంచి రోజులు రానున్నాయి. పేదల కోసం ఇప్పటికే రూ. 5కే భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న జీహెచ్ఎంసీ.. త్వరలోనే రూ. 4కే 20 లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించే ఏర్పాట్లు చేస్తోంది. 400 నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు యోచన ఉన్నప్పటికీ తొలిదశలో 60 ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సర్కిళ్ల వారీగా నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న బస్తీలు/కాలనీలను గుర్తించారు. ఈ బస్తీల్లో ఆర్ఓ ప్లాంట్లను జీహెచ్ఎంసీయే ఏర్పాటు చేస్తుంది. స్థానిక స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)లకు కొద్దిరోజుల శిక్షణనిచ్చి.. అనంతరం నిర్వహణ బాధ్యతను వాటికే అప్పగిస్తుంది. ఖర్చులు పోను మిగిలే ఆదాయం ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అందుతుంది. బస్తీలకు స్వచ్ఛమైన నీటి సదుపాయంతోపాటు ఎస్‌హెచ్‌జీలతో ఎంతోకొంత ఆదాయం చేకూరుతుందని భావిస్తున్నారు. గ్రేటర్లో 1,476 మురికివాడలు ఉండగా, వీటిల్లో చాలా బస్తీలకు కనీస నీటి సదుపాయం లేదు. శివారు మునిసిపాలిటీల్లోని కాలనీల్లోనూ అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించేందుకు ఉద్దేశించిన ‘టిప్’ పథకం అటకెక్కింది. ఇలాంటి కాలనీలు 900 పై చిలుకు ఉన్నాయి. దాదాపు 40 లక్షల మంది జనాభాకు అవసరమైన తాగునీరు లేదు. తొలిదశలో మురికివాడలపై దృష్టిసారించిన జీహెచ్ఎంసీ.. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పేదలకు స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం కోసం రూ. 20 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఆయా బస్తీల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. భూగర్భ జలాలు అధికంగా ఉన్న చోట పవర్‌బోర్లు వేస్తారు. సమీపంలోని కమ్యూనిటీ హాలు.. లేదా జీహెచ్ఎంసీ లేదా ఇతర ప్రభుత్వ భవనంలో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. ఇలా తొలిదశలో 60 ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకుగాను 62 బస్తీలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. నిరంతర నీటి సర ఫరాకు అక్కడ వీలుందా లేదా అనే సాంకేతికాంశాల్ని ఇంజినీరింగ్ విభాగం అధికారులు తనిఖీ చేస్తున్నారు. నివేదిక రాగానే నీటిశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. శుద్ధి చేసిన నీటిని 20 లీటర్ల క్యాన్‌ను రూ. 4 కే అందజేస్తారు. ప్లాంట్ వద్దకు వెళ్లేవారికి ఈ ధర వర్తిస్తుంది. శివారు ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ. 300 కోట్లు కేటాయించారు. పైపులైన్ల ద్వారా శాశ్వత నీటి సదుపాయం సమకూరేంత వరకు అక్కడ కూడా ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసే ఆలోచనలున్నాయి.