బోరుబావిలో పడిన చిన్నారి మృతి | Minor girl rescued from borewell dead | Sakshi
Sakshi News home page

బోరుబావిలో పడిన చిన్నారి మృతి

Published Sun, Apr 3 2016 7:42 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

Minor girl rescued from borewell dead

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరు జిల్లాలో బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. సైన్యం, అధికారులు తీవ్రంగా శ్రమించి చిన్నారి ఖుషిని బయటకి తీసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఈ రోజు ఉదయం చిన్నారి ఖుషి నవాబ్‌జంగ్‌ ప్రాంతంలోని 25 అడుగుల లోతున్న బోరుబావిలో పడింది. తన తల్లి వద్దకు పరిగెత్తుకుంటూ వెళుతున్న సమయంలో చిన్నారి బోరుబావిలో పడింది.

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, సైన్యం ఘటనాస్థలికి చేరుకుని కొన్ని గంటలపాటు శ్రమించి చిన్నారి బయటకు తీసుకురాగలిగారు. కానీ, ఆసుపత్రికి రాకముందే చిన్నారి మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement