delhi accident
-
Delhi: బోరు బావిలో చిన్నారి.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
దేశ రాజధాని ఢిల్లీలోని ఒక బోరుబావిలో చిన్నారి పడిపోయింది. ఈ ప్రమాదం ఢిల్లీ వాటర్ బోర్డు ప్లాంట్‌లో చోటుచేసుకుంది. కేశోపూర్ మండి సమీపంలోని ఢిల్లీ వాటర్ బోర్డు ప్లాంట్‌లోని 40 అడుగుల లోతైన బోరుబావిలో ప్రమాదవశాత్తూ ఓ చిన్నారి పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ, ఎన్డిఆర్ఎఫ్, ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారిని రక్షించేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఢిల్లీ అగ్నిమాపక శాఖ సిబ్బంది మాట్లాడుతూ బోరుబావిలో పడిన చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. ఎన్డిఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ వీర్ ప్రతాప్ సింగ్‌తో పాటు ఆ శాఖ బృందం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది. బాధిత చిన్నారిని బయటకు తీసుకువచ్చేందుకు ఆ బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వి , చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు కృషి చేస్తున్నారు. #WATCH | Delhi: A child fell into a 40-foot-deep borewell inside the Delhi Jal Board plant near Keshopur Mandi. The NDRF team has reached the site along with Inspector-in-charge Veer Pratap Singh from NDRF. It will soon start rescue operations by digging a new borewell parallel… pic.twitter.com/CbD4GAKzR3 — ANI (@ANI) March 10, 2024 -
Delhi Horror: మహిళలు రోడ్డెక్కాలంటే భయం.. అదే పెద్ద సమస్య!
జనవరి 1 తొలి క్షణాల్లోనే దేశ రాజధానిలో ఒక యువతిని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ల దూరం లాక్కుపోయిన ఘటన 2023 సంవత్సరానికి భయానక మైన ప్రారంభాన్ని ఇచ్చింది. రహదారి భద్రత భారతదేశంలో అతిపెద్ద సమస్య. రోడ్డుపై సంభవిస్తున్న మరణాల్లో దాదాపు 90 శాతం అతివేగం, ఓవర్ టేకింగ్, ప్రమాదకరమైన డ్రైవింగ్ వల్లే జరుగుతున్నాయి. ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 20 అగ్రశ్రేణి దేశాల్లో ఇండియా తొలి స్థానంలో ఉంది. వీటికి అదనంగా చీకటిపడ్డాక బహిరంగ ప్రదేశాల్లో ప్రయాణిస్తున్నప్పుడు లైంగిక దాడి భయం మహిళలను వెంటాడుతుంటుంది. మహిళల కదలికలను హింస, భయం అడ్డుకుంటున్నాయి. వీటికి పేలవమైన ప్రజా రవాణా సేవలు తోడవుతున్నాయి. జనవరి 1న ఐదుగురు పురుషులు ఉన్న కారు ఒక యువతి బైక్‌ని ఢీకొట్టి పలు కిలోమీటర్ల దూరం ఆమెను లాక్కునిపోయిన ఘోరమైన ఉదంతం, 2023 సంవత్సరానికి భయానకమైన ప్రారంభాన్ని ఇచ్చింది. ఈ ఘటనలో ప్రమాదకరమైన అనేక అంశాలు దాగి ఉన్నాయి. మొదటగా, వారు ఒక అమ్మాయిని తమ కారుతో 4 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లి పోతున్నామనే స్పృహ కూడా లేనంత పూటుగా తాగి ఉన్నట్లు వార్తలొచ్చాయి. లేదా వారు స్పృహలో ఉండి ఉండవచ్చు కూడా. రెండు.. ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న యువతిని కారుతో ఢీకొట్టిన డ్రైవర్ ఆమెకు సహాయం చేయాలని కూడా భావించలేదు. బదులుగా, అతడు చాలా వేగంగా కారు తోలాడు. ఒక వార్త ప్రకారం, కారులో ఉన్న వారు ఆ తర్వాత కారు ఆపి యువతి శరీరాన్ని కారు కిందనుంచి తొలగించి పారిపోయారు. ఈ విషయంలో వారు ఎలాంటి విచక్షణ, స్పందన లేకుండా వ్యవహరించారు. ఒక చావుకు కారణమయ్యామనే ఆలోచన కూడా వారికి లేదు. ఒక వ్యక్తిని కాపాడటం కంటే తమను తాము కాపాడుకోవడం గురించే వారు ఆందోళన చెందారు. అందుకే రోడ్డుమీదే ఆమెను చని పోయేలా చేసి వెళ్లిపోయారు. దారినపోతున్న వారు పోలీసులకు ఆమె గురించి సమాచారం ఇచ్చారు. వీధిలోని సీసీటీవీ కెమెరా ద్వారా కారును గుర్తించారు. పైగా, ఆ మహిళ రోడ్డుమీద వివస్త్రగా పడి ఉన్నందున, ఆమెపై లైంగిక దాడి జరిగి ఉంటుందేమో ఆనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. ఆ యువతికి 20 సంవత్సరాలుంటాయి. తన పని ముగించుకుని ఆమె ఇంటికి వెళుతోంది. ఆమెకు ఎదురైన భయానకమైన మరణాన్ని, తద్వారా ఆమె తల్లి, ఇతర కుటుంబ సభ్యుల దుఃస్థితిని తల్చుకోవాలంటే కూడా హృదయం బద్దలవుతోంది. రహదారి భద్రత అతిపెద్ద సమస్య రహదారి భద్రత భారతదేశంలో అతిపెద్ద సమస్య. దుర్బలమైనవారు మరింత ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. రోడ్డు పక్కన కూర్చుని లేదా నిద్రపోతున్నవారిని వేగంగా పోతున్న కార్లు ఢీకొని ప్రమాదాలకు గురిచేస్తున్న అనేక ఉదంతాలు ఉన్నాయి. కేవలం 2021లోనే 1.5 లక్షల మంది ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయారు. కొన్నేళ్లుగా ఇదే ధోరణి కొన సాగు తోంది. నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో గణాంకాల ప్రకారం, వీటిల్లో 1.9 శాతం మద్యం, మత్తు పదా ర్థాల ప్రభావంలో జరిగినవి. రోడ్డుపై సంభవి స్తున్న మరణాల్లో దాదాపు 90 శాతం అతివేగం, ఓవర్ టేకింగ్, ప్రమాదకరమైన డ్రైవింగ్ వల్లే జరుగుతున్నాయి. 2019 నుంచి ప్రపంచ బ్యాంకు డేటాను పరిశీలిస్తే, అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న 20 అగ్రశ్రేణి దేశాల్లో ఇండియా తొలి స్థానంలో ఉంది. చీకటిపడ్డాక బహిరంగ ప్రదేశాల్లో ప్రయాణి స్తున్నప్పుడు లైంగిక దాడికి సంబంధించిన భయం కూడా మహిళలను వెంటాడుతుంటుంది. ఈ ఉదం తంలో లైంగిక దాడి రుజువు కాకున్నప్పటికీ, అలాంటి దాడి జరిగే అవకాశం ఉందన్న వాస్తవం ఈ దేశంలోని ప్రతి మహిళకూ అదనపు ఆందోళ నను కలిగిస్తుంటుంది. జాతీయ మహిళా కమిషన్ ప్రత్యేకించి పేర్కొన్నట్లుగా, ఈ కోణాన్ని కూడా ఈ ఉదంతంలో పరిశీలించడం చాలా ముఖ్యం. నగరాలు మహిళలకు అందిస్తున్న అవకా శాలు, వాటిని వారు దక్కించుకుంటున్న సామర్థ్యా లపై హింస గణనీయమైన ప్రభావం చూపుతోంది. ఐక్యరాజ్యసమితి, ‘ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ విమెన్’ పరిశోధన ప్రకారం నగరాల్లో మహిళలు అనేక రూపాల హింసకు, లైంగిక వేధిం పులకు గురవుతున్నారు. పెద్దగా అరిచి భయ పెట్టడం, దేహ భాగాలను గట్టిగా నొక్కడం, వెంబ డించడంతోపాటు, లైంగిక దాడి వంటి తీవ్ర నేరాలు కూడా జరుగుతున్నాయి. ప్రతిరోజూ జరుగుతున్న ఈ హింస, వేధింపులు నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో మహిళల అనుభవాలను నిర్దేశిస్తున్నాయి. నగరాల్లో మహిళల కదలికలను హింస, భయం అడ్డుకుంటున్నాయి. వీటికి పేలవ మైన ప్రజా రవాణా సేవలు తోడవుతున్నాయి. పనిచేయడం, తిరిగి రావడం విషయంలో కీలక వేళల్లో రవాణా ప్రణాళికలు సాధారణంగా పురు షుల ప్రయాణ నమూనాలపైనే దృష్టి పెడు తున్నాయి. మరోవైపు మహిళల ప్రయాణ నమూ నాలు వారి సంరక్షక పాత్రల దృష్ట్యా పురుషులతో పోలిస్తే తరచుగా విభిన్నంగా ఉంటున్నాయని మహిళల కదలికలపై ప్రపంచ బ్యాంక్ నివేదిక చెబుతోంది. మహిళల ప్రయాణాల్లో 84 శాతం వరకు ప్రజా రవాణా ద్వారానే జరుగుతున్నాయని ఇదే నివేదిక తెలుపుతోంది. పనికి నడిచిపోవడాన్నే మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ విష యంలో మహిళల వాటా 45.4 శాతంగా ఉండగా, పురుషుల శాతం 27.4గా మాత్రమే ఉంటోంది. పైగా చాలామంది మహిళలు బస్సు ద్వారా ప్రయా ణిస్తున్నారు. తాము ప్రయాణిస్తున్నప్పుడు మహి ళలు స్థోమతను చూసుకుంటారని ఈ నివేదిక చెబుతోంది. ఖర్చు ఎక్కువయ్యే వేగ ప్రయాణాల కంటే ఖర్చు తక్కువగా ఉండే నిదాన ప్రయాణ సాధనాలనే వీరు ఎంపిక చేసుకుంటున్నారు. రోడ్డు ప్రమాద బాధితుల్లో అధిక శాతం పురుషులేనని నివేదిక చెబుతోంది. అంటే మహిళలతో పోలిస్తే పురుషులు చాలా ఎక్కువగా బయట కెళ్లడానికి ఇష్ట పడుతుంటారనీ, సొంత బైక్‌ని కలిగి ఉంటారనీ, రాత్రిపూట ప్రయాణిస్తుంటారనీ ఇది ఎత్తి చూపు తోంది. మహిళల కదలికలపై ఆంక్షలు అనేవి పితృస్వామిక ఆచారాలు, సంరక్షక భారం నుంచి ఏర్పడుతున్నాయి. పైగా శ్రామిక శక్తిలో మహిళల స్వల్ప పాత్రపై ఇవి ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచంలోకెల్లా రోడ్డు ప్రమాదాల్లో అధిక మరణాలకు సంబంధించి భారతదేశం అత్యధిక రేటును కలిగి ఉంటోంది. బహిరంగ స్థలాల్లో మహిళలపై హింసకు సంబంధించిన అత్యధిక రేటు కూడా భారత్ సొంతమై ఉంది. మన వీధులు, రహదారులు అటు ప్రమాదాలు, ఇటు నేరాల నుంచి తప్పనిసరిగా సురక్షితంగా ఉండాలి. శర వేగంగా వెళ్లే కార్ల కంటే పాదచారుల సురక్షిత కదలి కలకు వీలిచ్చేలా వీధులను రూపొందించాలి. ఇదే మన నగరాలను గణనీయంగా మారుస్తుంది. కార్లు అతివేగంగా దూసుకెళ్లేలా, మరిన్ని ఫ్లై ఓవర్లకు, ఓవర్ బ్రిడ్జిలకు, పెద్దగా వెలుతురు లేని రహదారు లకు దారులు తీస్తున్న మన ప్రస్తుత రహదారి ప్రణాళికలు పాదచారులు సులభంగా గాయాలకు, హింసకు లోనయ్యేలా రూపొందుతున్నాయి. రద్దీ గానూ, చక్కటి వెలుతురుతోనూ ఉంటూ మంచి పేవ్మెంట్లు, వీధుల్లో విక్రేతలు, షాపులు, నిఘా కెమెరాలతో కూడిన కెఫేలు తాము సురక్షితంగా ఉన్నామని మహిళలు భావించడానికి ఎంతో అను కూలంగా ఉంటాయని దేశవ్యాప్తంగా ‘సేఫ్టీపిన్’ సంస్థ ద్వారా జరిగిన భద్రతాపరమైన మదింపులు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా, సైక్లింగ్ కోసం మౌలిక వసతుల కల్పన, ప్రజారవాణాను అందు బాటులోనూ, చౌకగానూ ఉంచడం వల్ల వీధుల్లో ట్రాఫిక్ తగ్గుతుంది. ఈ చర్యలు మన వీధులను సురక్షితంగానూ, అందుబాటులో ఉండేలా, ఎక్కువమందికి అనుకూలంగా మలుస్తాయి. -కల్పనా విశ్వనాథ్, వ్యాసకర్త లింగ, నగరీకరణ నిపుణురాలు; ‘సేఫ్టీపిన్’ సీఈఓ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
Delhi: దారుణానికి ముందు గొడవ పడ్డ అంజలి, నిధి
న్యూఢిల్లీ: ఢిల్లీలో అంజలీ సింగ్ అనే యువతిని కారు ఢీకొట్టి, 12 కిలోమీటర్లు లాక్కెళ్లిన ఘటనలో మరికొన్ని విషయాలు వెలుగుచూశాయి. డిసెంబర్ 31వ తేదీ రాత్రి అంజలి స్కూటీపై ఆమె స్నేహితురాలు నిధి కూడా ఉన్నట్లు తేలింది. అయితే, అంతకుముందు వారిద్దరూ డబ్బు విషయమై ఘర్షణకు కూడా దిగినట్లు అంజలి స్నేహితుడొకరు వెల్లడించాడు. ఈ కేసులో నిందితులను కాపాడేందుకు యత్నిస్తున్నట్లు అనుమానాలున్న అశుతోష్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మరో అనుమానితుడు అంకుశ్ ఖన్నా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇలా ఉండగా, మృతురాలు అంజలీ సింగ్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందజేయనున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. ఇదీ చదవండి: అంజలి ఘటనతో అట్టుడుకుతున్న ఢిల్లీ.. మహిళా కమిషన్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు -
Kanjhawala Case:‘సాక్ష్యాలను దాచేందుకు ప్రయత్నం.. సీబీఐకి అప్పగించాలి’
Delhi Horror: ఢిల్లీ కారు ప్రమాదంలో మృతిచెందిన అంజలి సింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశం మొత్తాన్ని కుదిపేసిన ఈ ఘటనలో తవ్వేకొద్ది అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరైన సమయంలో ఢిల్లీ పోలీసులు స్పందించలేదంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు నిరసనలతో ఢిల్లీ అట్టుడుకుతోంది. నిందితులకు ఉరితీయాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. సుల్తాన్‌పురి కారు ప్రమాద కేసులో పోలీసుల విచారణ సంతృప్తి కరంగా లేదంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ ఎస్ మలివాల్ మండిపడ్డారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు నిధి ఫోన్ స్వాధీనం చేసుకోలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అది ఈ కేసులో చాలా ముఖ్యమైన సాక్షం. ఇందులో పోలీసుల వైఫల్యం కనిపిస్తుంది. పోలీసుల వైఫల్యం పోలీసులు ఇప్పటికీ యువతి మృతదేహాన్ని ఈడ్చుకెళ్లిన 13 కిలోమీటర్ల దూరంలోని అన్నీ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించలేదు. 164 సీఆర్పీసీ ప్రకారం ప్రత్యక్ష సాక్షులు స్టేట్మెంట్ను రికార్డ్ చేయలేదు. కారు చక్రాల కింద యువతి మృదేహం చిక్కుకుందని ఉదయం 2.22 నిమిషాలకు పోలీసులుకు సమాచారం వచ్చింది. కానీ పోలీసులు ఉదయం.4.15 నిమిషాలకు నగ్న స్థితిలో ఉన్న మహిళ మృతదేహం రోడ్డుపై పడి ఉన్నట్లు సమాచారం అందుకున్న తర్వాతే చర్యలు ప్రారంభించారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని సిఫార్సు చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. 18 బృందాలుగా కాగా అంజలి సింగ్ కేసుపై ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. దీనిపై 18 బృందాలు పనిచేస్తున్నాయని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు అశుతోష్‌కు చెందినదిగా.. యాక్సిడెంట్ సమయంలో అమిత్ కారు డ్రైవ్ చేసినట్లుగా గుర్తించారు. ఈ కేసులో మరో ఇద్దరి(అశుతోష్, అంకుష్) ప్రయేయం ఉన్నట్లు పేర్కొన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. వీరిద్దరూ మిగతా అయిదుగురు నిందితులకు స్నేహితులని పేర్కొన్నారు. అయితే వీరు ప్రమాద సమయంలో కారులో లేరని, మిగిలిన ఐదుగురు నిందితులను రక్షించేందుకు ఇద్దరూ ప్రయత్నించారని పేర్కొన్నారు. ఏ సంబంధం లేదు నిందితులకు మృతురాలు, ఆమె స్నేహితురాలు నిధితో ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిందితులు అనేక సాక్ష్యాలను దాచేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. వీలైనంత త్వరలో ఈ కేసులో చార్జీషీట్ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇద్దరు కొత్త నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. నిందితులకు నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలని భావిస్తున్నారని పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరు కారు కింద అంజలి మృతదేహాన్ని గమనించి అక్కడి నుంచి ఆటోలో పరారయ్యాడని, అంజలి ఫోన్ ఇప్పటి వరకు దొరకలేదని వెల్లడించారు. చదవండి: యూపీ సీఎం కాషాయ దుస్తులపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. #StandWithAnjali@priyanktripathi shares more information about Ashutosh, the main owner of the car involved in the death of Anjali.@Aditi14Bhardwaj dissects the details emerging from the latest CCTV footage which shows the accused getting down & checking the car. pic.twitter.com/PiRaH6j83d — TIMES NOW (@TimesNow) January 5, 2023 -
ఢిల్లీ యువతి ఘటన.. హోటల్ ఓనర్‌పై మహిళా కమిషన్ సీరియస్..
న్యూఢిల్లీ: ఢిల్లీలో యువతిని కారుతో ఈడ్చికెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. జనవరి 31 అర్ధరాత్రి దాటిన తర్వాత న్యూ ఇయర్ రోజున ఈఘటన జరిగింది. అయితే అంతకుముందు ఏం జరిగిందో ఓ హోటల్ యజమాని వివరించాడు. ఈ ఘటనలో చనిపోయిన యువతి(అంజలి) తన స్నేహితురాలు(నిధి)తో కలిసి హోటల్‌కు వచ్చిందని పేర్కొన్నాడు. ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారని, ఒకరితో ఒకరు గొడవపడి హోటల్లో రచ్చ చేశారని చెప్పాడు. ఇది చూసి ఇద్దరినీ బయటకు గెంటేసినట్లు వెల్లడించాడు. హోటల్ ఓనర్ వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ సీరియస్ అయ్యారు. బాధితురాలిపై నిందలు మోపడం సరికాదన్నారు. అర్ధరాత్రి సమయంలో అమ్మాయిలను బయటకు ఎలా గెంటేస్తారని ప్రశ్నించారు. ఇద్దరు యువతులు మద్యం మత్తులో ఉన్నారనేందుకు ఆధారాలేంటని? అడిగారు. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు యువతులను హోటల్ నుంచి గెంటేయడం కంటే.. పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందని స్వాతి అన్నారు. అలా చేసి ఉంటే యువతి చనిపోయి ఉండేది కాదన్నారు. హోటల్ నుంచి వాళ్లను బయటకు పంపడం వల్లే ప్రమాదంలో యువతి ప్రాణాలు కోల్పోయిందన్నారు. ఈమేరకు ఆమె ట్వీట్ చేశారు. सुबह से होटल मालिक के घटिया बयान TV पे दिखाए जा रहे हैं, वो कह रहा है लड़कियों ने शराब पी थी, झगड़ा कर रही थीं और मैंने उन्हें बाहर निकाल दिया। अगर लड़कियाँ नशा करके झगड़ा कर रही तो पुलिस बुलाते, देर रात में उन्हें होटल से क्यूँ निकाला? नशे का क्या सबूत है? STOP VICTIM SHAMING! — Swati Maliwal (@SwatiJaiHind) January 3, 2023 జనవరి 1న ఉదయం 1:30 గంటల సమయంలో ఇద్దరు యువతులు హోటల్ నుంచి బయటకు వచ్చినట్లు సీసీటీవీ రికార్డులో ఉంది. ఆ తర్వాత కాసేపటికే ఆ యువతి స్కూటీని కారు ఢీకొట్టింది. చక్రాల మధ్య ఇరుక్కున్న ఆమెను గుర్తించకుండా మద్యం మత్తులో ఉన్న ఐదుగురు యువకులు కారును కిలోమీటర్ల మేర తిప్పారు. దీంతో యువతి చనిపోయింది. తెల్లవారుజామున ఆమె మృతదేహం నగ్నంగా రోడ్డుపై కన్పించడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. అర్థాంతరంగా నిలిపివేత.. -
శబాష్!! జొమాటో.. చెప్పింది చేసింది!
రోడ్డు ప్రమాదంలో మరణించిన డెలివరీ బాయ్‌కు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో అండగా నిలిచింది. సలీల్ త్రిపాఠి కుటుంబానికి రూ.10లక్షల బీమాను మంజూరు చేసింది. ఇదే విషయాన్ని జొమాటో సహవ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు జొమాటో డెలివరీ బాయ్‌లు సైతం సలీల్ కుటుంబానికి రూ.12లక్షల మొత్తాన్ని వారి కుటుంబానికి అందించినట్లు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా 'మా డెలివరీ పాట్నర్ (డెలివరీ బాయ్) సలీల్ త్రిపాఠి దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో మరణించినందకు బాధపడుతున్నాం. ప్రమాదంలో ఒంటరైన బాధితుడి కుటుంబానికి అండగా నిలిచేలా అన్నీ విధాల సాయం అందిస్తున్నట్లు ట్వీట్ చేశారు. జొమాటో పాట్నర్ మరణిస్తే వారి కుటుంబానికి జొమాటో వ్యక్తిగతంగా సాయం అందిస్తుంది. ప్రమాదం జరిగిన రాత్రి సలీల్ కుటుంబంతో కలిసి ఆస్పత్రిలోనే ఉన్నాం. మరణించిన తర్వాత ఇతర ఖర్చుల కింద కుటుంబానికి సాహాయం చేశామని' దీపిందర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. We are deeply aggrieved by the death of our delivery partner Salil Tripathi in an unfortunate road incident. We are extending all possible support to help the family get through this – pic.twitter.com/yJOUDsPpet — Deepinder Goyal (@deepigoyal) January 13, 2022 ఇక డెలివరీబాయ్ మరణించిన వారి కుటుంబానికి ఎలాంటి అవసరాలున్నాయో.. వాటి అనుగుణంగా జొమాటో సాయంతో చేసేలా అండగా నిలుస్తోంది.సలీల్ భార్య సుచేతకు ఉద్యోగం కావాలంటే జొమాటో అన్ని ప్రయత్నాలు చేస్తుందని, తద్వారా ఆమె ఇంటిని పోషించడానికి, 10 ఏళ్ల కొడుకును చదివించేందుకు తోడ్పడుతుందని గోయల్ ట్వీట్లో ప్రస్తావించారు. తప్పతాగి గత శనివారం రాత్రి ఢిల్లీలో జొమాటోలో డెలివరీబాయ్ సలీల్ త్రిపాఠీ ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళుతున్నాడు. అదే సమయంలో వేగంగా వెళుతున్న ఓ కార్ సలీల్ త్రిపాఠీ బైక్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బాధితుడు సలీల్ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ దర్యాప్తులో సలీల్ మరణానికి కానిస్టేబుల్ జిలే సింగ్ కారణమని నిర్ధారించారు. మద్యం మత్తులో సలీల్ మరణానికి కారణమైన జిలే సింగ్‌ను పోలీస్ శాఖ అతడిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: శెభాష్ జొమాటో.. అందరూ ఇలా ఆలోచిస్తే బాగుండు! -
హిట్ అండ్ రన్.. అనాథగా 6 నెలల చిన్నారి!
ఓ కారు డ్రైవర్ అతివేగం కుటుంబం మొత్తాన్ని చిదిమేసింది. భార్యాభర్తలతో పాటు వాళ్ల కొడుకు కూడా మరణించాడు. ఇంటి దగ్గర ఉండిపోయిన ఆరు నెలల చిన్నారి అనాథగా మారింది. ఈ విషాదకరఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. సాయంత్రం 6 గంటల సమయంలో రామ్ సజీవన్ అనే వ్యక్తి సైకిల్ మీద వెళ్తుండగా ఎర్రలైటు పడటంతో సిగ్నల్ వద్ద ఆగాడు. వెనక సీటుమీద భార్య సుందర, ముందు రాడ్ మీద కొడుకు ముకేష్ కూర్చున్నారు. వాళ్లు అలా ఆగారో లేదో.. వెనక నుంచి సిల్వర్ కలర్ శాంత్రో కారు ఒకటి వచ్చి సైకిల్‌ను ఢీకొట్టింది. దాంతో వాళ్లు ముగ్గురూ గాల్లోకి ఎగిరి, డివైడర్‌కు అవతలివైపు రోడ్డుమీద పడ్డారు. తలకు తీవ్రగాయాలు కావడంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న తమ కూతురికి మందులు కొనుక్కోడానికి బయటకు వెళ్లిన సజీవన్ కుటుంబం.. అలా నిర్జీవంగా మిగిలిపోయింది. కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేసినా, తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు. ప్రమాదస్థలంలో కారు నంబర్ ప్లేటు కూడా పడిపోవడంతో డ్రైవర్‌ను గుర్తించడం సులభమైంది. ఆ సమయానికి అక్కడ ఉన్నవాళ్లు కారు పగిలిన విడిభాగాలను సేకరించారు. వాటిలో నంబర్ ప్లేటు కూడా ఉంది. వాటన్నింటినీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు సీసీటీవీ కెమెరా ఫీడ్ కూడా చూసి, శివకుమార్ అనే కారు డ్రైవర్‌ను అతడి ఇంటి వద్ద అరెస్టు చేశారు. కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగే సమయానికి తాను కూడా వాళ్ల వెనకాలే సైకిల్ మీద వెళ్తున్నానని, ఉన్నట్టుండి వాళ్లు గాల్లో ఎగిరి రోడ్డుకు అవతలివైపు పడిపోయారని, అయితే కారు బాగా వేగంగా వెళ్లిపోవడంతో పట్టుకోలేకపోయామని సుందర అన్న శారదా ప్రసాద్ తెలిపారు. అనాథగా చిన్నారి.. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు అన్నను కూడా పోగొట్టుకున్న 6 నెలల రిధి అనాథగా మారిపోయింది. ఎప్పుడూ అమ్మానాన్నలతోనే ఉండటంతో... వాళ్లకోసం విపరీతంగా ఏడుస్తోంది. ఇంకా తల్లిపాలే అలవాటు ఉండటంతో కనీసం సీసాతో పాలు కూడా తాగడం లేదు. ఆమెను ఎలా సముదాయించాలో తమకు అర్థం కావడం లేదని.. సజీవన్ ఇంటి పక్కనే ఉండే అతడి బావమరిది శారదా ప్రసాద్ చెప్పారు.