నేడు జనవాడకు కేంద్ర మంత్రి ఆనంద్‌శర్మ | Anand Sharma visits shankarpalli | Sakshi
Sakshi News home page

నేడు జనవాడకు కేంద్ర మంత్రి ఆనంద్‌శర్మ

Published Fri, Jan 3 2014 12:35 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

Anand Sharma visits shankarpalli

 శంకర్‌పల్లి, న్యూస్‌లైన్: మం డలంలోని జనవాడలో వాటర్ హెల్త్ ఇండియా, జలధార ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను శుక్రవా రం మధ్యాహ్నం కేంద్ర వా ణిజ్య పన్నుల శాఖ మంత్రి ఆనంద్ శర్మ ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాం తాల్లోని ప్రజలకు పరిశుద్ధమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో వాటర్‌హెల్త్ ఇండి యా ఆధ్వర్యంలో ఈ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. దీనిని ప్రారంభించడానికి కేంద్ర మంత్రి ఆనంద్ శర్మతోపాటు భారత్‌లోని అమెరికా రాయబారి నాన్సీ పా వెల్, హాలీవుడ్ దర్శకులు, బాలీవుడ్ నటులు, దేశంలోని పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజ రు కానున్నారు. ప్రముఖులు రానుండటంతో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే పోలీసులు ఈ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement