
రాయికల్ (జగిత్యాల): జగిత్యాల జిల్లా రాయికల్ మండలం చింతలూరు గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఎస్పీ అనంతశర్మ చెప్పారు. శుక్రవారం ‘సాక్షి’ మెయిన్‌లో ‘మరో ఉద్దానం.. చింతలూరు’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఎస్పీ అనంతశర్మ స్పందించారు. జగిత్యాలలోని రోటరీ క్లబ్ ప్రతినిధులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్‌శర్మ ఆధ్వర్యంలో వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 29న గ్రామంలో వైద్య శిబిరం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా సమస్యను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment