![Adivi Sesh Installs Water Plant In Hyderabad Hospital - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/5/adivi.jpg.webp?itok=FoKGOb32)
కొందరు సెలబ్రిటీలు సామాజిక ధృక్పథాన్ని కలిగి ఉంటారు. సమాజంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పుడు తమ వంతుగా ఏదైనా చేయాలనుకుంటారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలువురు తారలు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా అడివి శేష్ కూడా ప్రభుత్వాసుపత్రిలోని నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. హైదరాబాద్‌లోని కోఠి ప్రభుత్వ హాస్పిటల్‌లో దాదాపు 300 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు.
ఆ ఆసుపత్రిలో సిబ్బందితో పాటు రోగులకు తాగునీటి సమస్య ఏర్పడిందనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న శేష్ తాత్కాలికంగా వాటర్ బాటిల్స్‌ను అందించారు. అంతేకాదు.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనుకుని హాస్పిటల్ అవసరాలకు సరిపడా తాగునీటిని సరఫరా చేసేందుకు సొంత ఖర్చుతో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయించారు. ఇది గంటకు వెయ్యిలీటర్ల నీటిని శుద్ధి చేస్తుంది. తాగునీటి సమస్య తీర్చిన శేష్‌ని ఆస్పత్రిలోని కరోనా రోగులు, హాస్పిటల్ సిబ్బంది అభినందించారు. చదవండి: (గొప్ప మనసు చాటుకున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్)
Comments
Please login to add a commentAdd a comment