భారత్-పాక్ మ్యాచ్‌పై ఉగ్ర దాడి..!
చాంపియన్స్ ట్రోఫిలో భాగంగా భారత్-పాకిస్తాన్‌ల బర్మింగ్‌హామ్‌లోని ఎడ్గ్‌బాస్టన్ మైదానాంలో జరగనున్న వన్డే మ్యాచ్‌పై ఐఎస్‌ఐ కన్ను పడింది. దాదాపు 14 మంది ఐఎస్‌ఐ ఏజెంట్లు ఇరుదేశాల మధ్య మ్యాచ్‌ను వీక్షించేందుకు ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్నట్లు తెలిసింది. మ్యాచ్ సందర్భంగా కశ్మీర్ వివాదంపై పోస్టర్లను ప్రదర్శించాలని ఐఎస్‌ఐ వీరిని కోరినట్లు సమాచారం.
కశ్మీర్‌కు స్వతంత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏ3 ప్లకార్డులను ప్రదర్శించాలని ఐఎస్‌ఐ వారి ఏజెంట్లతో పేర్కొన్నట్లు తెలిసింది. 'కశ్మీర్ తన వైపు చూడాలని కోరుకుంటోంది. కశ్మీర్ రక్తం కారుస్తోంది. మేం కశ్మీర్‌కు దన్నుగా నిలుస్తాం. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్రం ఇవ్వాలి.' అనే నాలుగు నినాదాలను ప్ల కార్డుల్లో ఉంచాలని ఏజెంట్లను ఆదేశించినట్లు తెలిసింది.
మరోవైపు శనివారం రాత్రి లండన్‌లో ఉగ్రదాడుల జరిగిన విషయం తెలిసిందే. దీంతో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్గ్‌బాస్టన్ గ్రౌండ్‌లో జరగనున్న భారత్, పాకిస్తాన్ మీద ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఇంగ్లండ్ ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు వర్షం కూడా అంతరాయం కలిగించే అవకాశం ఉంది.