
ఇమ్రాన్ ఖాన్ వెనుక ఐఎస్ఐ
మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహరిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ ను ఐఎస్ఐ నడిపిస్తోందా. అవుననే అంటున్నారు పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి.
ఇస్లామాబాద్: మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహరిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ ను ఐఎస్ఐ నడిపిస్తోందా. అవుననే అంటున్నారు పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి. ఇమ్రాన్ ఖాన్ కు ఐఎస్ఐ మాజీ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షుజా పాషా 'స్ట్రాటజిక్ అడ్వైజర్' గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇమ్రాన్కు పాషా సలహాలిస్తున్నారని పేర్కొన్నారు. రాజధాని ఇస్లామాబాద్ లో ఉద్రిక్తతలు సృష్టించాలని వీరు కుట్ర చేశారని ఆరోపించారు. ఇందుకోసమే లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకు ఇమ్రాన్ఖాన్ గురువారం ర్యాలీ చేయాలని నిర్ణయించారని తెలిపారు. 60 వేల మంది ఈ ర్యాలీలో పాల్గొంటారని భావిస్తున్నారు.