ప్రయాగ్‌రాజ్: ఉమేశ్‌పాల్ హత్యకేసులో గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అతీక్ అహ్మద్‌కు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ, ఉగ్రవాద లష్కరే తోయిబాతో సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు. గురువారం యూపీ పోలీసులు అతీక్ అహ్మద్‌ను, అతడి సోదరుడు అష్రాఫ్‌ను భారీ బందోబస్తు నడుమ ప్రయాగ్‌రాజ్‌లోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ‘నాకు ఆయుధాలు, డబ్బుకు కొదవలేదు. పాక్ నుంచి డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లో పంజాబ్‌కు ఆయుధాలు, డబ్బు చేరుతాయి.
అక్కడ మా వాళ్లు వాటిని అందుకుంటారు. కశ్మీర్ ఉగ్రవాదులు కూడా తీసుకెళతారు. కావాలంటే మీరు నన్ను అక్కడికి తీసుకెళ్తే డబ్బు, ఆయుధాలు అందజేస్తా’అంటూ అతీక్ అహ్మద్ విచారణలో వెల్లడించిన విషయాలను యూపీ పోలీసులు ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించారు. రెండు గంటలపాటు సాగిన వాదోపవాదాల అనంతరం అతీక్, అష్రాఫ్‌లిద్దరికీ ఈనెల 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి, ఐదు రోజుల పోలీసు రిమాండ్‌కు అనుమతిస్తూ మేజిస్ట్రేట్ దినేశ్ గౌతమ్ ఆదేశాలిచ్చారని ఉమేశ్ పాల్ భార్య తరఫు లాయర్ చెప్పారు. ఇద్దరినీ రిమాండ్ పూర్తయ్యేదాకా ప్రస్తుతమున్న సబర్మతీ, బరేలీ జైళ్లలోనే ఉంచుతారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment