ద్వారకపై ఉగ్ర గురి
Published Thu, Oct 6 2016 5:36 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
అహ్మదాబాద్: గుజరాత్ లోని ద్వారక గుడిపై దాడికి ఉగ్రమూకలు కుట్ర పన్నాయి. కేంద్ర నిఘా సంస్ధ(సీఐ) బుధవారం అందించిన సమాచారం మేరకు గుజరాత్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ సంస్ధ ఐఎస్ఐ ద్వారక గుడిపై పెద్ద దాడికి కుట్ర పన్నినట్లు సమాచారం ఉందని సీఐ తెలిపింది.
గుడిలో నరమేథం సృష్టించేందుకు ఇప్పటికే 12 నుంచి 15 మంది ముష్కరులు గుజరాత్ తీర ప్రాంతానికి చేరుకుని ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. ద్వారకా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ముష్కరులు నక్కి ఉండే అవకాశం కూడా ఉందని తెలిపింది. దీంతో అధికారులు తీర ప్రాంత గస్తీని పెంచారు. రెండు అనుమానాస్పద చేపల పడవలు భారత జలాల్లోకి ప్రవేశించడానికి వేడి చూస్తున్నట్లు కూడా సీఐకు సమాచారం ఉంది. ఈ విషయంపై కోస్ట్ గార్డు, నేవీ, మెరైన్ పోలీసులకు సీఐ సమాచారం అందించినట్లు తెలిసింది.
Advertisement