న్యూఢిల్లీ: పాకిస్తాన్ గూఢచారి సంస్థ (ఐఎస్ఐ) తరఫున గూఢచర్యం నెరపుతున్నట్లు ఆరోపణల నేపథ్యంలో మాజీ ఎయిర్ఫోర్స్ అధికారి రంజిత్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్ఐ తీవ్రవాదులతో సంబంధాలున్నాయని అనుమానంతో రంజిత్ సింగ్ను సోమవారం పంజాబ్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి స్వస్థలం కేరళగా గుర్తించారు. కాగా పోలీసులు ఇవాళ రంజిత్ సింగ్ను స్థానిక కోర్టులో హాజరు పరిచారు. విచారణ నిమిత్తం అతడిని అయిదు రోజుల పాటు కస్టడీకి తీసుకోనున్నారు.
అయిదేళ్లుగా ఇండియన్ ఎయిర్ఫోర్స్లో పని చేస్తున్న రంజిత్ అధికారి పాకిస్థాన్ ఏజెన్సీలు పన్నిన వలలో చిక్కుకున్నాడు. సదరు సంస్థలు ఎరవేసిన ఓ యువతితో (హనీ ట్రాప్) అశ్లీల వీడియో చాటింగ్‌తో ఫిదా అయి.. కీలకమైన రహస్య సమాచారాన్ని ఆమెకు అందించాడు. గత మూడు నెలలుగా సాగుతున్నట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కూపీ లాగడంతో వెలుగులోకి వచ్చింది. కాగా యువతిని ఎరగావేసిన పాక్ సంస్థలు తమకు కావాల్సిన సమాచారం మొత్తం లాక్కున్నాయని తేలింది.
ఎయిర్ఫోర్స్లో ఉండే కీలక నెట్‌వర్క్ వ్యవస్థ పనితీరు, అధికారులు పేర్లు, ఫోన్ నంబర్లు, బేస్ క్యాంప్‌ల వివరాలు, హెడ్ క్వార్టర్స్ అడ్రస్‌లు, వంతెనల వివరాలను రంజిత్.... ఆ యువతికి చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎయిర్ఫోర్స్ అధికారులు గతరాత్రి రంజిత్ను విధుల నుంచి తొలగించారు. అలాగే సైనికాధికారుల నుంచి రహస్యాలను సేకరిస్తున్న ‘గూఢచర్య’ రాకెట్‌కు సంబంధించి జమ్మూకశ్మీర్‌లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఐఎస్ఐకు మాజీ సైనికుడి గూఢచర్యం
Published Tue, Dec 29 2015 2:14 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement