
సాక్షి, న్యూఢిల్లీ : గల్ఫ్ దేశాల్లో భారత్‌పై తప్పుడు వార్తల్ని ప్రచారం చేసేందుకు పాకిస్తాన్ గూడఛర్య సంస్థ ఐఎస్‌ఐ వాడుతున్న నకిలీ ఖాతాను ట్విటర్ తొలగించింది. సౌదీ యువరాణి నౌరా బింట్ ఫైసల్ పేరును అనుకరించేలా నౌరాఅల్‌సాద్ ఐడీ పేరుతో ఇదనియాలుసాఫ్ అనే ఖాతాను ట్విటర్ నిలిపివేసింది. పాకిస్తాన్ నుంచి నిర్వహిస్తున్నఈ ట్విటర్ ఖాతా ద్వారా భారత్ వ్యతిరేక ప్రచారాన్ని హోరెత్తిస్తున్నట్టు గుర్తించారు. ఇతరులను బెదిరించడం, వేధింపులకు గురిచేయడం వంటి కార్యకలాపాలు సాగిస్తున్నందున ఇవి తమ ప్రమాణాలకు అనుగుణంగా లేవంటూ సదరు ఖాతాను ట్విటర్ తొలగించింది.
సోషల్ మీడియా వేదికల్లో పలు నకిలీ ఖాతాలను ఉపయోగిస్తూ భారత్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీపై గల్ఫ్ దేశాల్లో ఐఎస్‌ఐ విషం చిమ్ముతోందని భారత భద్రతా దళాలు ఎప్పటి నుంచో పేర్కొంటున్న సంగతి తెలిసిందే. నకిలీ ఖాతాలతో సోషల్ మీడియాలో భారత వ్యతిరేక సందేశాలను పాకిస్తాన్ చేరవేస్తోందని ఆధాలతో సహా భారత నిఘా వర్గాలు నివేదికను రూపొందించాయి. భారత్‌పై విద్వేష విషం చిమ్మేందుకు గల్ప్ దేశాల రాచరిక కుటుంబ సభ్యుల పేరుతో నకిలీ ఖాతాలను సృష్టిస్తున్నట్టు పరిశోధకులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment