న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఐ గూఢచర్యంపై అప్రమత్తంగా ఉండాలని రక్షణ శాఖను కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. రక్షణ శాఖ సమాచారం కోసం ఆర్మీ మాజీ అధికారులకు ఉద్యోగ అవకాశాలు, డబ్బు ఎరవేస్తూ ముగ్గులోకి దింపుతుందని ఇంటెలిజెన్స్ నివేదికల్ని ఉటంకిస్తూ అప్రమత్తం చేసింది. ఉత్తరభారత్‌కు చెందిన రిటైర్డు ఆర్మీ ఉద్యోగులో నకిలీ సంస్థ ఏర్పాటు చేసి మాజీ ఉద్యోగులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఉందని తెలిపింది.