న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో అలజడి సృష్టించేందుకు ఖలిస్తాన్ అనుకూల సంస్థలతో పాకిస్తాన్ చేతులు కలిపింది. కశ్మీర్ ఖలిస్తాన్ రిఫరెండమ్ ఫ్రంట్ (కేకేఆర్‌ఎఫ్) పేరుతో సరికొత్త సంస్థగా ఆవిర్భవించి ఉగ్ర కుట్రకు తెరలేపిందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. నిఘా వర్గాల సమాచారం ప్రకారం పాక్‌కు చెందిన ఐఎస్‌ఐ ఖలిస్తానీ ఉగ్రవాదులతో కుమ్మక్కై భారత్‌లో భారీ దాడులకు పథక రచన చేసింది. కేకేఆర్‌ఎఫ్ సంస్థలో యువతను చేర్పించడంతో పాటు భారత్‌లో తీవ్ర అలజడి సృష్టించేందుకు ఈ ఉగ్ర సంస్థకు పెద్దసంఖ్యలో ఆయుధాలు, పేలడు సామాగ్రిని చేర్చేందుకు ఐఎస్‌ఐ ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు పసిగట్టాయి. కశ్మీర్, ఖలిస్తాన్‌లను ప్రతిబింబిచేలా కే2 ప్లాన్‌ను అమలుచేస్తున్న పాకిస్తాన్ సరిహద్దుల ద్వారా సరికొత్త సంస్థలో సరిహద్దుల గుండా ఉగ్రవాదులను చొప్పించడం, డ్రోన్‌ల ద్వారా ఆయుధ సామాగ్రిని సమకూర్చడం వంటి చర్యలకు ఐఎస్‌ఐ పాల్పడుతోందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment