inteligence
-
ఔరా! అవుట్ ఆఫ్ ది బాక్స్.. చిత్రరంగానికి ఏఐ హంగులు!
రామ్‌గోపాల్‌వర్మ ‘కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: అప్పల్రాజు’ సినిమాలో రాఖీ డైలాగు...‘డైరెక్టర్ కావాలంటే ఊరకే కథలు మాత్రమే రాస్తే సరిపోదయ్యా’ కట్ చేస్తే... సినీ కలల యువతరం ఇప్పుడు ఊరకే కథలు రాస్తూ, కలలు కంటూ మాత్రమే కూర్చోవడం లేదు. చిత్రరంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతికతను అధ్యయనం చేస్తోంది. ఇంటర్నెట్నే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్గా చేసుకొని ‘స్క్రిప్ట్ బుక్’ ‘ఐవా’ ‘మాజిస్టో’లాంటి ఎన్నో ఏఐ టూల్స్‌పై అవగాహన పెంచుకొని వినూత్నంగా ఆలోచిస్తోంది... పుణెకు చెందిన నైనా పాటిల్ పేరుకు ఇంజనీరింగ్ చదువుతుందిగానీ ఆమె కలలన్నీ చిత్రసీమ వైపే. ఇంట్లో చెబితే ఒప్పుకోరని తెలుసు. అయితే ఆ భయమేమీ తన కలలకు అడ్డుగోడ కావడం లేదు. తీరిక వేళల్లో అత్యాధునిక సినీ సాంకేతికతకు సంబంధించిన విషయాలు, విశేషాలు తెలుసుకోవడం తనకు ఇష్టం. కోయంబత్తూరుకు చెందిన నిఖిల్ తేజను ఒక్కసారి కదిపి చూడండి. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి లేటెస్ట్, గ్రేటెస్ట్ విశేషాలను గుక్కతిప్పుకోకుండా చెబుతాడు. సినీ సాంకేతికతపై అతని పట్టు చూస్తే ‘రాబోయే రోజుల్లో కాబోయే డైరెక్టర్’ అని ఢంకా బజాయించి చెప్పవచ్చు. ఒక సినిమా హిట్ కావాలంటే కథ బాగుండాలి. బాగున్న కథను బాగా చెప్పగలగాలి. బాగా చెప్పడానికి మాటల నైపుణ్యంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ రూపంలో సాంకేతిక నైపుణ్యాన్ని కూడా తోడుగా తెచ్చుకుంటుంది సినిమా కలల యువతరం. ఏఐ టూల్స్ వల్ల కథ వినే వారికి గంటల కొద్ది సమయం వృథా కాకపోవడం ప్లస్ పాయింట్. సినిమాలకు సంబంధించి యువతరం ఆసక్తి చూపుతున్న కొన్ని ఏఐ టూల్స్...పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా ఏఐ టూల్ ‘స్క్రిప్ట్ బుక్’ను సులభంగా ఉపయోగించవచ్చు. సినిమాలు, టీవీ షోలకు స్క్రిప్ట్ క్రియేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. క్యాస్టింగ్, జానర్, స్టోరీ స్ట్రక్చర్‌కు సంబంధించి విశ్లేషణ చేయవచ్చు. ‘డెమోక్రటైజింగ్ స్టోరీటెల్లింగ్ త్రూ ది ఆర్ట్ ఆఫ్ ఏఐ’ అంటూ తనను పరిచయం చేసుకుంటుంది స్క్రిప్ట్‌బుక్. ఇది సినిమా జయాపజయాలను కూడా అంచనా వేయగలదు అంటున్నారు గానీ ఎంతవరకు నిజమో తెలియదు. డిఫరెంట్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్బుక్లో రకరకాల ప్యాకేజీలు ఉన్నాయి. ఇండివిడ్యువల్ రైటర్లు, చిన్న ప్రొడక్షన్ హౌజ్‌ల కోసం ది బేసిక్ ప్యాకేజ్, మల్టిపుల్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి స్క్రిప్ట్ ఎనాలసిస్ చేయడానికి ది స్టాండర్డ్ ప్యాకేజీ, ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్‌లు, స్టూడియోల కోసం ది ప్రీమియం, నిర్దిష్టమైన అవసరాల కోసం ది ఎంటర్ప్రైజ్లాంటి ప్యాకేజ్‌లు ఉన్నాయి. స్టోరీ టెల్లింగ్ ఏఐ టూల్స్‌లో ప్లాట్‌గన్ ఒకటి. దీనితో యానిమేటెడ్ ఫిల్మ్ సులభంగా రూపొందించవచ్చు. యూజర్–ఫ్రెండ్లీ అడ్వాన్స్డ్ ఫీచర్లతో సినీ కథకులకు, కంటెంట్ క్రియేటర్లకు ప్లాట్‌గన్ దగ్గరైంది. ‘ప్లాట్‌గన్’ను ఉపయోగించడానికి డ్రాయింగ్ స్కిల్క్స్ అవసరం లేదు. ఎన్నో క్యారెక్టర్లతో కూడిన లైబ్రరీ, ఎక్స్‌ప్రెసివ్ యానిమేషన్స్, టైమ్–సేవింగ్ యానిమేషన్, కస్టమ్ వాయిస్ వోవర్స్ అండ్ సౌండ్‌ట్రాక్స్... దీని ప్రత్యేకత. ఏఐ ప్లాట్‌ఫామ్ ‘అడోబ్ సెన్సే’ వీడియో ఎడిటింగ్, ఆటోమేటెడ్ కలర్ కరక్షన్స్, ఆడియో ఎన్హాన్స్మెంట్ \కు సంబంధించి రకరకాల టూల్స్‌ను అందిస్తోంది. ‘ఎమోషన్ ఏఐ’ టూల్స్‌తో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్‌ను ఎనలైజ్ చేయవచ్చు. ‘మాజిస్టో’ అనేది ఎడిటింగ్ విధానాన్ని సరళం చేసే ఏఐ పవర్డ్ వీడియో ఎడిటింగ్ టూల్. ఫుటేజీలోని ‘బెస్ట్ మూమెంట్స్’ ఆటోమేటిక్‌గా ఈ టూల్ సెలెక్ట్ చేస్తుంది. మ్యూజిక్‌ను యాడ్ చేస్తుంది. విజువల్ క్వాలిటీ విషయంలో తనవంతు పాత్ర పోషిస్తుంది. ఐవా (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్చువల్ ఆర్టిస్ట్) అనేది ఏఐ–పవర్డ్ మ్యూజిక్ కంపోజిషన్ టూల్. మోడ్రన్ సినిమాటిక్, ఎలక్ట్రానిక్, పాప్, రాక్, జాజ్... ఇలా రకరకాలుగా మ్యూజిక్ క్రియేట్ చేసుకోవచ్చు. స్టోరీలైన్స్, వీటితోపాటు ప్లాట్ ఐడియాలు జెనరేట్ చేయాలనుకునే వారికి ఉపయోగపడే ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి. ‘స్క్రిప్ట్‌బుక్’ నుంచి ‘ఐవా’ వరకు సినిమాలకు సంబంధించి సకల సాంకేతిక విషయాలను తెలుసుకోవడానికి ఏ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లోనూ శిక్షణ అక్కర్లేదు. ఇంటర్నెట్ ఉంటే చాలు! ఏఐ జెనరేట్ సోరీలైన్లు, డైలాగులు, స్క్రిప్ట్‌లు త్వరలో మన ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కూడా రావచ్చు. ఏఐ జెనరేట్ చేసిన స్టోరీలైన్లు, స్క్రిప్ట్‌లను నమ్ముకోవడమా, తమలోని క్రియేటివిటీని మాత్రమే నమ్ముకోవడమా.. అనే రెండు దారులు కనిపించవచ్చు. ‘ఏఐ సాంకేతికత అందరికీ అందుబాటులోకి వచ్చాక ప్రత్యేకత అంటూ ఉండకపోవచ్చు. స్టోరీలైన్లను క్రియేట్ చేయడంలో సహజత్వం మిస్ కావచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాంకేతికత కంటే సహజత్వానికే ప్రాధాన్యత ఇవ్వాలి. సాంకేతికతపై అవగాహన ఉండడం ముఖ్యమే కాని అది మాత్రమే ముఖ్యం కాదు. సమాజాన్ని అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే కొత్త కథలు పుడతాయి’ అంటుంది దిల్లీకి చెందిన మాస్ కమ్యూనికేషన్ స్టూడెంట్ వర్షిణి. (చదవండి: సరికొత్త ఆలోచన!..ఎవ్వరికీ తట్టనది..రెస్టారెంట్లన్నీ..) -
భారత్ సైనిక రహస్యాల కోసం పాక్ పన్నాగం..
-
మరణించాడని భావిస్తే.. మళ్లీ ప్రత్యక్షమయ్యాడు..
-
నిమ్స్‌లో వ్యాక్సిన్ పంపిణీలో అవకతవకలు
సాక్షి, హైదరాబాద్: నిమ్స్‌లో వ్యాక్సిన్ పంపిణీలో అవకతవకలు చోటుచేసుకున్నాయి. నిమ్స్‌లో 7వేల మంది అనర్హులకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిమ్స్‌లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం ఇంటలిజెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై నిమ్స్ డైరెక్టర్ మనోహర్ మాట్లాడుతూ..'' వ్యాక్సిన్ అవకతవకలపై విచారణ కొనసాగుతోంది. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడలేం. డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ కేవీ కృష్ణారెడ్డి పాత్రపైనా దర్యాప్తు జరుగుతోంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నాం. ఆధార్ కార్డు లేకుండా వ్యాక్సిన్ ఇస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. విజిలెన్స్ నివేదిక తర్వాత సర్టిఫికెట్ల జారీపై నిర్ణయం తీసుకుంటామని'' తెలిపారు. -
చైనా సూపర్ సైనికులను సృష్టిస్తోంది: అమెరికా
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను ఆర్థికంగా దెబ్బ తీయడం కోసమే చైనా కరోనా వైరస్‌ని తయారు చేసి వదిలిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికన్ ఇంటిలిజెన్స్ అత్యున్నతాధికారి ఒకరు ప్రపంచం మీద ముఖ్యంగా అమెరికాపై పట్టు సాధించడం కోసం చైనా జీవశాస్త్రపరంగా అత్యున్నత సామార్థ్యాలు కలిగిన సూపర్ సైనికులను సృష్టిస్తోంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాక రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన నాటి నుంచి డ్రాగన్ దేశం ప్రపంచ దేశాల ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలకు పెద్ద ప్రమాదంగా మారిందని తెలిపారు. నేషనల్ ఇంటిలిజెన్స్ డైరెక్టర్ రాట్క్లిఫ్ వాల్‌స్ట్రీట్ జర్నల్ వెబ్సైట్లో ప్రచురించిన ఓ ఆర్టికల్‌లో చైనాపై సంచలన ఆరోపణలు చేశారు. పైగా ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి కనుక చైనా విషయంలో నిజాయతీగా ఉండాలని సూచించారు. ఇక ఈ కథనంలో రాట్క్లిఫ్ చైనా జీవశాస్త్రపరంగా మెరుగైన సామార్థ్యాలు కల సూపర్ సైనికులను సృష్టిస్తోందని.. ఇప్పటికే వీరిపై అనేక ట్రయల్స్ కూడా నిర్వహించారని ఆరోపించారు. ఇక చైనా నేడు అమెరికాకు అతిపెద్ద ప్రమాదంగా మారిందని.. కానీ రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచే డ్రాగన్ ప్రపంచ దేశాల స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాలకు ముప్పుగా మరిందని వెల్లడించారు. (చదవండి: పక్కా ప్లాన్ ప్రకారమే గల్వాన్ దాడి..) ఇక ఫెడరల్ వార్షిక బడ్జెట్లో 85 బిలియన్ డాలర్ల వనరులను చైనాపై దృష్టి సారించడానికే వినియోగిస్తున్నామన్నారు రాట్క్లిఫ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతేడాదిలో రాట్క్లిఫ్ని అత్యున్నత అమెరికా గుఢచార పదవిలో నియమించారు. ఇక రాట్క్లిఫ్ మాట్లాడుతూ.. చైనా ఆర్థిక గుఢచర్యం రాబ్, రిప్లికేట్ అండ్ రిప్లేస్(దొంగిలించడం, నకలు తయారి చేయడం, రీప్లేస్ చేయడం)గా సాగుతుందని తెలిపారు. చైనా కంపెనీలు అన్ని ఈ విధానాన్ని అనుసరించి అమెరికా కంపెనీల టెక్నాలజీని దొంగతనం చేసి.. దానికి కాపీ తయారు చేసి.. తిరిగి మార్కెట్లోకి తక్కువ ధరకు తీసుకొస్తాయని ఆరోపించారు రాట్క్లిఫ్. అంతేకాక చైనా, అమెరికా రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని దొంగతనం చేసిందని.. ఆ తర్వాతే జిన్‌పింగ్ చైనా మిలిటరీ ఆధునికీకరణ కార్యక్రమాల్లో దూకుడు పెంచారని ఆరోపించారు. చైనా అధికారులు అమెరికా రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలని భావించారని రాట్క్లిఫ్ వెల్లడించారు. అయితే అమెరికా చేసిన టెక్నాలజీ దొంగతనం వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని చైనా విదేశాంగ ప్రతినిధి హువా చునింగ్ ఎద్దేవా చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చైనా మార్కెట్ విస్తరిస్తుండటంతోనే అమెరికా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని విమర్శించారు. (చదవండి: డోక్లాంలో చైనా గ్రామం.. ఖండించిన భూటాన్) ఇదే కాక అమెరికా-బీజింగ్ మధ్య గత కొంతకాలంగా కరోనా వైరస్, హాంకాంగ్‌పై చైనా పట్టు, సౌత్ చైనా సీ అంశంలో తలెత్తిన వివాదం, వాణిజ్యం, జిన్‌పింగ్ పాలనలో చోటు చేసుకుంటున్న మానవ హక్కుల హననం వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య విబేధాలు తలెత్తాయి. ప్రస్తుతం అమెరికా-చైనాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. రాటక్టిఫ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు సృష్టించి, ప్రచారం చేయడం అమెరికాకు కొత్త కాదని చైనా విమర్శించింది. ఇక బుధవారం అమెరికన్ ప్రభుత్వం యూఎస్ ఆడిటింగ్ నిబంధనలను పూర్తిగా పాటించని చైనా కంపెనీలను స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచి తొలగించే చట్టాన్ని ఆమోదించింది. -
కేంద్రం నిఘా నేత్రం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలోని నకిలీ ధ్రువీకరణ పత్రాల అంశంలో పలు కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. 127 మంది రోహింగ్యాలకు ఆధార్ కార్డుల వ్యవహారం, విదేశీయుల వద్ద భారత పాస్‌పోర్టుల అంశాలు కలకలం రేపడంతో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. కొందరు స్థానికులు కావాలనే వీరికి ఈ పత్రాలు ఇప్పిస్తున్నారని గుర్తించారు. ఇప్పటికే వారిని గుర్తించిన పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మ రం చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా సమాచారం సేకరించింది. పాతబస్తీలో అక్రమంగా నివసిస్తోన్న విదేశీయుల అక్రమాలపై కేంద్ర నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు ఢిల్లీకి నివేదికలు పంపుతూనే ఉన్నాయి. విదేశీయులు ఈ కార్డులు కలిగి ఉండటం వల్ల దేశభద్రతకు భంగం వాటిల్లడమే కాకుండా, ఈ కార్డులతో పలు దేశాల్లో ఉగ్రచర్యలు, ఆత్మాహుతి దాడులకు పాల్పడితే.. ఆ నింద మన దేశం మోయాల్సి వస్తుందని పలువురు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం. తీవ్రంగా పరిగణిస్తోన్న పోలీసులు యెమన్ దేశస్తుడికి పాస్‌పోర్టు వచ్చిన విషయంపై తెలంగాణ పోలీసులు కూడా సీరియస్‌గా దృష్టి పెట్టారు. ఈ వ్యవహారంలో అంతర్గత విచారణకు ఆదేశించారని సమాచారం. చూడగానే విదేశీయుడు అని తెలిసిపోతున్నా.. యెమన్ దేశస్తుడు ముబారక్‌కు భారత పాస్‌పోర్టు రావడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతని పాస్‌పోర్టు విచారణకు వెళ్లిన పోలీసు అధికారిని ప్రశ్నించేందుకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు సమాచారం. ఈ వ్యవహారంలో డబ్బులు తీసుకునే విచారణలో అతనికి అనుకూలంగా రిపోర్టు ఇచ్చి పాస్‌పోర్టు వచ్చేలా సహకరిం చారని ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. భారత ధ్రువీకరణ కార్డులతో విదేశాలకు వెళ్లి అక్కడ ఉగ్రచర్యలకు పాల్పడితే.. ఆ నింద మన దేశం మోయాల్సి ఉంటుందని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ కార్డులతో పౌరసత్వం వచ్చినట్లు కాదు.. ఆధార్, పాన్, ఓట రు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉన్న విదేశీయులపై ఇప్పటికే పదుల సం ఖ్యలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసులు పెట్టారు. వీరు ఈ గుర్తింపు కార్డులతో భారతీయులు అయిపోరని స్పష్టం చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి అసోంలో స్థిరపడిన పలువురు దాదాపు 15 రకాల భారత ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉన్నా.. వారికి భారత పౌరసత్వం లభించని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పాతబస్తీ పరిణామాలపై కేంద్ర ఇంటెలిజెన్స్ ఆరా ధ్రువీకరణ పత్రాలెలా తీసుకుంటున్నారంటే?దేశంలో అక్రమంగా చొరబడి నగర శివార్లలో తలదాచుకుంటున్న వేలాది మందికి పాతబస్తీలో పలువురు ఆశ్రయం కల్పిస్తున్నారు. వీరిలో పలువురు కాంట్రాక్టర్లు, చిన్న చిన్న పరిశ్రమల నిర్వాహకులు ఉన్నారు. వారు తమ ఖార్ఖానాల్లో తక్కువ ధరకు పనిచేసేందుకు వీరిని పెట్టుకుంటున్నారు. రాత్రిపూట సంచరించే సమయంలో, తరచుగా శివారు కాలనీల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ చేస్తున్నప్పుడు ధ్రువీకరణ పత్రాలు అడుగుతుండటం వారికి ఇబ్బందికరంగా మారింది. దీంతో సదరు ఆశ్రయం కల్పించిన నిర్వాహకులే తమ ఇంటి కరెంటు బిల్లులు ఇచ్చి విదేశీయులకు ఓటరు, ఆధార్, పాన్ తదితర ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలు ఇప్పిస్తున్నారు. పాతబస్తీలో డబ్బులు తీసుకుని పనిచేసే కొందరు ఏజెంట్లు కూడా ఈ తతంగానికి సహకరిస్తున్నారు. దీంతో వీరు సులువుగా అన్ని రకాల ధ్రువీకరణలు పొందుతున్నారు. -
పాక్ కుయుక్తులకు నిఘా వర్గాల చెక్..
న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో అలజడి సృష్టించేందుకు ఖలిస్తాన్ అనుకూల సంస్థలతో పాకిస్తాన్ చేతులు కలిపింది. కశ్మీర్ ఖలిస్తాన్ రిఫరెండమ్ ఫ్రంట్ (కేకేఆర్‌ఎఫ్) పేరుతో సరికొత్త సంస్థగా ఆవిర్భవించి ఉగ్ర కుట్రకు తెరలేపిందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. నిఘా వర్గాల సమాచారం ప్రకారం పాక్‌కు చెందిన ఐఎస్ఐ ఖలిస్తానీ ఉగ్రవాదులతో కుమ్మక్కై భారత్‌లో భారీ దాడులకు పథక రచన చేసింది. కేకేఆర్‌ఎఫ్ సంస్థలో యువతను చేర్పించడంతో పాటు భారత్‌లో తీవ్ర అలజడి సృష్టించేందుకు ఈ ఉగ్ర సంస్థకు పెద్దసంఖ్యలో ఆయుధాలు, పేలడు సామాగ్రిని చేర్చేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు పసిగట్టాయి. కశ్మీర్, ఖలిస్తాన్‌లను ప్రతిబింబిచేలా కే2 ప్లాన్‌ను అమలుచేస్తున్న పాకిస్తాన్ సరిహద్దుల ద్వారా సరికొత్త సంస్థలో సరిహద్దుల గుండా ఉగ్రవాదులను చొప్పించడం, డ్రోన్ల ద్వారా ఆయుధ సామాగ్రిని సమకూర్చడం వంటి చర్యలకు ఐఎస్ఐ పాల్పడుతోందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
దేశంలోకి ఉగ్రవాదులు? హై అలర్ట్ ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో బాంబు దాడులే లక్ష్యంగా ఐదుగురు ఉగ్రవాదులు గోరఖ్‌పూర్ సమీపంలోని ఇండో నేపాల్ సరిహద్దు గుండా దేశంలోకి చొరబడే ప్రయత్నాల్లో ఉన్నారంటూ నిఘావర్గాలు గురువారం హెచ్చరించాయి. దీపావళి పండుగ రోజు భారీ దాడులు చేయాలనే ప్రణాళికతో వారు ఉన్నారని వెల్లడించాయి. భారత్‌లో ప్రవేశించిన తర్వాత ఉగ్రవాదులకు కశ్మీర్‌లోని కొందరు వ్యక్తులు అవసరమైన సహాయమందిస్తారని వారి ఫోన్ సంభాషణలను బట్టి తెలుస్తోందని ఓ అధికారి పేర్కొన్నారు. ఉగ్రవాదుల ఫోన్లను ట్యాప్ చేసిన నిఘా విభాగం, లొకేషన్ ఆధారంగా చివరిసారిగా నేపాల్ సరిహద్దుల్లో వారిని గుర్తించినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దేశంలో హై అలర్ట్ ప్రకటించింది. మరోవైపు పంజాబ్‌లోని రక్షణ స్థావరాలపై దాడి జరిగే అవకాశముందని బుధవారం నిఘావర్గాలు ఇచ్చిన సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. వాయుసేన పంజాబ్‌లోని పఠాన్‌కోట్ స్థావరంతో పాటు ఇతర ఎయిర్‌బేస్‌లలో ఆరెంజ్ నోటీసును జారీ చేసింది. మరోవైపు జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పటి వరకు దాదాపు 60 మంది ఉగ్రవాదులు ఎల్వోసీ, అంతర్జాతీయ సరిహద్దుల గుండా దేశంలో ప్రవేశించారని నిఘా విభాగం తెలిపింది. బంగ్లా సైనికుల కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ మృతి మత్స్యకారులను విడిపించేందుకు చర్చలకు వెళ్లిన బీఎస్ఎఫ్ జవాన్లపై గురువారం బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ కాల్పులు జరపడంతో ఒక హెడ్ కానిస్టేబుల్ మృతిచెందారు. మరో కానిస్టేబుల్ గాయాల పాలయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్శీదాబాద్ జిల్లాలో గురువారం చోటుచేసుకొంది. బంగ్లా సరిహద్దుల్లో ఉన్న పద్మ నదిలో చేపల వేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారులను బంగ్లా బలగాలు తమ అదుపులోకి తీసుకొని అనంతరం ఇద్దరిని విడిచిపెట్టాయి. మిగిలిన ఒకరిని విడిపించడానికి బీఎస్ఎఫ్ అధికారులు బంగ్లా సైనికాధికారులతో చర్చలకు వెళ్లారు. ఈ సందర్భంగా బంగ్లా సైనికులు భారత జవాన్లతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో వెనుదిరిగిన బీఎస్ఎఫ్ జవాన్లపై వెనుక నుంచి బంగ్లా సైనికులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ విజయ్ భాన్ సింగ్ తలలో బుల్లెట్ దూసుకుపోగా, మరో బుల్లెట్ కానిస్టేబుల్ కుడి చేయి నుంచి వెళ్లింది. వీరిద్దరినీ సహచర జవాన్లు హాస్పిటల్‌కు తరలించగా, హెడ్ కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మరణించాడు. కాగా, ఈ ఘటన పరిణామాలపై చర్చించేందుకు బంగ్లా సైనిక ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. -
పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత అరుణ
సాక్షి, రాజమండ్రి : మావోయిస్టు పార్టీ ఏవోబీ మిలటరి కమిషన్ చీఫ్ చలపతి భార్య అరుణను అంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతవారం జరిగిన గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు ఎన్కౌంటర్లో గాయపడిన అరుణ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అరుణతో పాటు గాయపడిన మరో మావోయిస్టు సభ్యురాలు భవానీ పెదబైలు దళానికి చెందిన సభ్యురాలిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన ఆమెను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం వీరిద్దరూ కోలుకోవడంతో విచారణ నిమిత్తం ఇంటెలిజెన్స్ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఇక గతవారం గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. అయితే ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనాయకురాలు అరుణ కూడా ఉన్నట్లు తొలుత అనుమానం వ్యక్తం చేశారు. అయితే అరుణ ఎదురుకాల్పుల్లో తప్పించుకుని పోలీసుల అదుపులో ఉందని, అమరుల బంధు మిత్రుల సంఘం ఆరోపించింది. కానీ ఆ వార్తలు అవాస్తమని పోలీసులు తేల్చిచెప్పారు. అయితే ఏడాది కిందట అప్పటి అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, అదే ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమల హత్యలో ఆరుణ కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. విశాఖ మన్యంలో కూంబింగ్ కొనసాగుతోంది: డీజీపీ సాక్షి, అమరావతి : విశాఖ మన్యంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గాలికొండ-గుత్తేడు ప్రాంతంలో మావోయిస్టు నేత సాకె కళావతి అలియాస్ భవాని గాయాలతో పోలీసులకి పట్టుబడినట్లు తెలిపారు. మావోయిస్టు స్టేట్ జోన్ కమిటీ మెంబర్ జగన్ భార్య భవాని అని, పెదబైలు ఏరియా కమిటీ మెంబర్‌గా భవానీ పనిచేస్తోందన్నారు. 20 ఏళ్లుగా మావో ఉద్యమంలో వివిధ విభాగాల్లో ఆమె పనిచేసిందన్నారు. భవానిని కోర్టులో హాజరుపరిచిన అనంతరం చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరిలించినట్లు డీజీపీ వివరించారు. -
పుల్వామా ఉగ్రదాడి.. వారి తప్పేమీ లేదు
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి విషయంలో ఇంటిలిజెన్స్ వైఫల్యం ఏమీ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో భాగంగా ఆయన ఈ ప్రకటన చేశారు. దేశ భద్రత కోసం ఇంటిలిజెన్స్, భద్రతా సిబ్బంది ఎంతో సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. గడిచిన మూడు దశాబ్ధాల కాలంలో అనేక మంది ఉద్రవాదులను భారత బలగాలు హతమార్చాయని ఆయన గుర్తుచేశారు. పుల్వామా ఉగ్రదాడికి కారణమైన జైషే ఏ మహ్మద్ స్థావరాలపై దాడులు చేసి.. ప్రతీకార చర్యలను కూడా చేపట్టామన్నారు. దేశంలో అశాంతి అనే పదం వినపించకుండా పాలించడమే ప్రభుత్వం లక్ష్యమని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదుల కుట్ర కారణంగానే ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారని వెల్లడించారు. దానిలో భాగంగా ఫిబ్రవరి 26న పాక్ సరిహద్దులోని బాలాకోట్‌పై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేపట్టినట్లు కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. -
రిసార్ట్స్‌లో మంత్రి రాసలీలలు
ఆయనో యువ మంత్రి. అలా అని ఎక్కడినుంచైనా ఎమ్మెల్యేగా గెలిచారా... అంటే అదేమీ లేదు. అనుకోకుండా ఆ పదవి దక్కింది. వచ్చిన అవకాశాన్ని ఆయన ప్రజాసంక్షేమానికి ఏమేరకు వినియోగించారన్నది పక్కన పెడితే... సొంత అవసరాలకు మాత్రం బాగానే ఉపయోగించుకుంటున్నారు. విలాసాలకోసం... షికార్లకోసం... యథేచ్ఛగా పదవిని అడ్డం పెట్టుకుంటున్నారు. ఏకంగా ఓ రిసార్ట్‌లో తాను తెచ్చుకున్న యువతితో రాసలీలలు సాగించిన వ్యవహారం ఇప్పుడు పోలీసు వర్గాల్లో గుప్పుమంటోంది. ఇంటెలిజెన్స్ విభాగంలో ఈ వ్యవహారం చక్కర్లు కొడుతోంది. సాక్షిప్రతినిధి, విజయనగరం: విశాఖ జిల్లాకు చెందిన ఓ యువ మంత్రి రాసలీలలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. భోగాపురం మండలం, ఎ.రావివలస గ్రామంలో 120 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఓ రిసార్ట్స్ ఉంది. అక్కడ ఒక్క రాత్రి గడపాలంటే రూ.6వేల వరకూ గది అద్దె చెల్లించాలి. ఎక్కడెక్కడి నుంచో ప్రేమ పక్షులు, ప్రముఖులు ఇక్కడికి వచ్చి తమ సరదాలు తీర్చుకుంటుంటారు. ఈ జాబితాలో రాష్ట్ర యువ మంత్రి కూడా చేరారు. విశాఖకు చెందిన ఓ యువతిని తీసుకువచ్చి ఆయన ఆ రిసార్ట్‌లో ఒక రోజు గడిపారు. అయితే వైద్యురాలైన ఆ యువతిని లైంగిక వేధింపులకు గురిచేశారని ఆమె బంధువులు ఆందోళన చేసినట్లు వార్తలు వచ్చా యి. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన ఇంటెలిజెన్స్ అధికారులు మంత్రి, లేడీ డాక్టర్ ఇష్టపూర్వకంగానే ఈ రిసార్ట్స్ లో గడిపినట్లు తేల్చారు. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం యువ మంత్రి గత నెల 15వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు అవివాహితైన లేడీ డాక్టర్‌తో కలసి సన్‌రే రిసార్ట్స్‌కు వచ్చారు. వీరితో పాటు గన్‌మెన్, ఎస్కార్ట్ సిబ్బంది కూడా ఉన్నారు. వీరు బస చేసేందుకు ముందుగా విల్లా లాంటిదేమీ బుక్ చేసుకోలేదు. దీంతో మంత్రి, ఆ యువతి దాదాపు అరగంటపాటు ఏసీ ఇండోర్ స్టేడియంలో ఆడుకున్నారు. అక్కడే రెస్టారెంట్లో మధ్యాహ్న భోజనం చేసి, నాలుగు గదులున్న 9వ నంబర్ విల్లాకు చేరుకున్నారు. వీటిలో 9091, 9092 నంబర్లు గల రూములు మంత్రి పేరుమీద బుక్ చేశారు. వీటిలో యువమంత్రి, యువతి 9091 రూమ్‌లో రెండు గంటలపాటు ఏకాంతంగా గడిపారు. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లి ఓ గంట ఉన్నారు. అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న బీచ్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో మంత్రి కారు నడపగా ఆయన పక్క సీట్లో ఆ యువతి కూర్చుంది. రాత్రి 8.30 గంటలకు వీరు విల్లాకు తిరిగి వచ్చారు. రాత్రి భోజనం చేసి 10.30 గంటలకు విశాఖపట్నం బయలుదేరారు. ఈ మొత్తం విహారంలో మంత్రి, యువతి చాలా దగ్గరగా మెలిగారు. వారితో ఉన్న సహాయకుడి సాయంతో ఫొటోలు తీయించుకున్నారు. ఆ యువతి యువ మంత్రికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని గన్‌మెన్, ఎస్కార్ట్ సిబ్బంది విచారణలో వెల్లడించారు. దీనిని బట్టి ఆ యువతిని లైంగికంగా వేధించినట్లు ఎక్కడా కనిపించలేదని పేర్కొంటూ ఇంటెలిజెన్స్ విభాగం విజయనగరం డీఎస్పీ తన నివేదికను విశాఖ రీజనల్ ఇంటెలిజెన్స్ అధికారికి శనివారం అందజేశారు. కాగా ఒక మంత్రి, తన విలువైన సమయాన్ని, గన్‌మెన్, ఎస్కార్ట్ సిబ్బంది విధులను ఈ విధంగా వ్యక్తిగత విలాసాలకు, సరదాలకు వినియోగించడం కూడా బాధ్యతారాహిత్యమే అవుతుంది. దీనిని ఆ యువమంత్రి, ఎన్నికల్లో గెలవకుండానే ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టిన ముఖ్యమంత్రి ఏ విధంగా సమర్ధించుకుంటారో చూడాలి. -
ఉగ్రవాది మునీర్‌కు మహిళ సహకారం?
బంగ్లాదేశ్ నుంచి బీహార్ మీదుగా కోలారు జిల్లాలో, ఆ తరువాత రామనగరలో మకాం వేసి నిఘావర్గాలకు దొరికిపోయిన అనుమానిత ఉగ్రవాది మునీర్ షేక్ ఉదంతం ఎన్నో ప్రశ్నలను సంధిస్తోంది. కర్ణాటకలో ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ విస్తరిస్తున్నాయనే అనుమానాలు మునీర్ అరెస్టుతో బలపడుతున్నాయి. ఈ వ్యవహారం విచారణలో మరిన్ని కోణాలు బయటపడే అవకాశముంది. దొడ్డబళ్లాపురం: రామనగర పట్టణంలో ఆదివారంరాత్రి ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో అరెస్టుచేసిన అనుమానిత ఉగ్రవాది మునీర్ గురించి విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. మునీర్ బంగ్లాదేశ్ వాసి అని, భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడని తెలుస్తోంది. మునీర్‌కు ఆధార్ కార్డు కూడా ఉండడం విశేషం. ఇది బీహార్‌లో తీసుకున్నాడా?, లేక కర్ణాటకలోనా? అన్నది వెల్లడికాలేదు. రామనగరలో ఇల్లు అద్దెకు ఇచ్చే సమయంలో ఇంటి యజమాని రఫీక్‌ఖాన్... మునీర్ నుండి ఆధార్‌కార్డ్ తీసుకున్నాడు, అయితే ఇటీవలే రైలు టికెట్ బుక్ చేయాలని సాకు చెప్పి మునీర్ ఆధార్‌కార్డు వెనక్కు తీసుకున్నాడట. రూ.50వేలు అడ్వాన్స్ అడగ్గా సగమే ఇవ్వడంతో ఇంటి యజమాని మునీర్‌కు అగ్రిమెంట్ చేసి ఇవ్వలేదు. ఖాన్‌కు మునీర్‌ను పరిచయం చేసింది ఒక మహిళని తేలింది. ఇప్పుడు ఆ మహిళ గురించి ఐబీ అధికారులు సీరియస్‌గా విచారణచేస్తున్నారు. మునీర్‌కు ఆమెకు సంబంధమేంటి? అది ఎటువంటి సంబంధం? ఆమెకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా? అనే కోణాల్లో తనిఖీ చేస్తున్నారు. మునీర్ కోసం అనేక రోజుల నుండి ఐబీ అధికారులు గాలిస్తున్నారు. చివరకు రామనగరలో తలదాచుకున్నట్టు తేలడంతో దాడి జరిపి అరెస్టు చేశారు. జేఎంబీ, ఐఎంలతో సంబంధాలు బీహార్‌లోని జమాపూర్ జిల్లా షక్రువిటా గ్రామవాసిగా చెప్పుకునే బుర్హాన్ అలియాస్ బంగ్లాదేశ్‌లోని మునీర్ షేక్ జమాతుల్ ముజాహిదీన్ (జేఎంబీ), ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థల్లో సభ్యుడు. బీహార్‌లో పోలీస్ కస్టడీలో ఉండగా పోలీసుల పై దాడిచేసి పరారయ్యాడు. బీహార్‌లోని పాట్నా జిల్లా బోధ్ గయాలో 2013లో జరిగిన వరుస పేలుళ్లకు, పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌లో 2014లో జరిగిన బాంబు పేలుడుకు ఐఈడీ బాంబులు తయారుచేసి ఇచ్చింది మునీర్‌గా తెలిసింది. తొలుత కోలారు జిల్లాలో మకాం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి వచ్చి బీహార్‌లో మకాం వేశాడు. బోధ్ గయా, బర్ధమాన్ బాంబ్ పేలుళ్ల తరువాత కోలారు జిల్లా మాలూరుకు మకాం మార్చాడు. అక్కడొక ప్రైవేటు కంపెనీలో హెల్పర్‌గా పనిచేసి అనంతరం రెండునెలల క్రితం రామనగరకు వచ్చాడు. మునీర్ చుట్టుపక్కల వారితో మాట్లాడేవాడు కాదు. సైకిల్‌పై ఊరూరూ తిరుగుతూ బట్టలు అమ్మేవాడు. ఉదయం 8 గంటలకు ఇల్లువదిలితే సాయంత్రం తిరిగి వచ్చేవాడు. అతని ఇంటికి ఎవ్వరూ బంధుమిత్రులు వచ్చేవారు కాదని ఇంటి యజమాని రఫీక్ చెబుతున్నాడు. మునీర్ భార్య, 3 ఏళ్ల కొడుకు, ఏడాది వయసున్న కూతురుతో నివసిస్తున్నాడు. బాడుగ ఇళ్ల బ్రోకర్‌గా భావిస్తున్న మహిళతో మునీర్ మొదట ఒక్కడే వచ్చి ఇల్లు చూశాడు. ఫ్యామిలీకి మాత్రమే ఇల్లు ఇస్తామనడంతో భార్యాపిల్లలను తీసుకొచ్చాడు. మునీర్ ఇంట్లో ఐబీ అధికారులు ఇండియా, కర్ణాటక మ్యాప్‌లు, ప్రముఖ పర్యాటక స్థలాల వివరాలు, రెండు ల్యాప్‌టాప్‌లు, జిలెటిన్ బాక్స్ స్వాధీనం చేసుకున్నారు. -
సిద్ధాంతి కిడ్నాప్ నిడదవోలులో కలకలం
నిడదవోలు : నిడదవోలు పట్టణం చిన కాశిరేవు సమీపంలో నివాసముంటున్న ప్రముఖ సిద్ధాంతి ప్రక్కి వీరభద్రరావు శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో కిడ్నాప్‌కు గురయ్యారు. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న సిద్ధాంతి ఇంటికి టాటా సుమోలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు సివిల్ దుస్తుల్లో వచ్చారు. ఇంటిలో స్నానానికి ఉపక్రమిస్తున్న వీరభద్రరావును అటకాయించారు. ఆయన సెల్‌ఫోన్ తీసుకుని స్విచ్ఆఫ్ చేశారు. విజయవాడ ఇంటిలిజెన్స్ పోలీసులమని పరిచయం చేసుకున్నారు. మీతో పనిఉందని, విజయవాడ ఇంటిలిజెన్స్ అధికారి రమ్మంటున్నారని చెప్పారు. ఉదయం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని బయటకు వెళ్లే అలవాటు ఉన్న ఆయనను తీసుకువెళ్ళడంతో భార్యకు అనుమానం వచ్చింది. స్నానం కూడా చేయనివ్వకుండా ఎందుకు తీసుకువెళుతున్నారని భార్య సూర్యకుమారి వారిని ప్రశ్నించగా సాయంత్రానికి తిరిగి పంపించేస్తామని చెప్పారు. మెయిన్ రోడ్డుకు 100 అడుగుల దూరంలో ఉన్న ఇంటి నుండి వీరభద్రరావును నడిపించుకుంటూ తీసుకెళ్ళారు. రోడ్డుపైకి రాగానే టాటా సుమోలో తీసుకువెళ్ళి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి నుండి సిద్ధాంతి బయటకు వెళ్ళిన పది నిమిషాలకు భార్య ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ చేసి ఉండటంతో ఏం జరిగింది... ఎక్కడకు తీసుకుని వెళ్ళారో తెలియక బంధువులు ఆందోళన చెందుతున్నారు. సిద్ధాంతికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు బెంగళూరు, హైద్రాబాద్‌లో ఉంటున్నారు. కిడ్నాప్ సమయంలో ఇంటిలో వీరభద్రరావుతో పాటు భార్య ఒక్కరే ఉన్నారు. నిడదవోలు రైల్వే చీఫ్ బుకింగ్ సూపర్వైజర్గా ఆరు నెలల క్రితం పదవీ విరమణ చేసిన వీరభద్రరావు జ్యోతిష్యం, జాతకాలు చెప్పడంలో మంచి పేరు సంపాదించారు. ఆయన చెప్పింది చాలా వరకు జరుగుతుందని కొందరి నమ్మకం. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉన్నత స్థాయి అధికారులు, న్యాయమూర్తులు ప్రతీ ఏటా ఆయన ఇంటికి వచ్చి జాతకాలు, జ్యోతిష్యం చెప్పించుకుంటారు. అసలు ఏం జరిగింది. ఎందుకు కిడ్నాప్ చేశారనే విషయం ఎవరికీ అంతుచిక్కడం లేదు. కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణలు తమ సిబ్బందితో వీరభద్రరావు ఇంటికి చేరుకున్నారు. ఆయన భార్య సూర్యకుమారి నుంచి వివరాలు సేకరించారు. పట్టణంలో వివిధ సెంటర్ల ద్వారా తెల్లవారు జాము నుండి వాహనాల రాకపోకలను సీసీ పుటేజీల ద్వారా పరిశీలిస్తున్నారు. రెండు టాటా సుమో వాహనాలు తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. సిద్ధాంతి ఇంటి చుట్టు పక్కల ఉన్న షాపుల యజమానులను ఆరా తీస్తున్నారు. పట్టణంలో ఉన్న లాడ్జీలలో ఉన్న రికార్డులను పరిశీలిస్తున్నారు. భార్య సూర్యకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిడదవోలు పట్టణ పోలీసులు కిడ్నాప్ కేసుగా నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్‌పై భిన్న కథనాలు : నిడదవోలుకు చెందిన ప్రముఖ సిద్థాంతి వీరభద్రరావు కిడ్నాప్‌పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కిడ్నాప్ సమాచారంతో పట్టణంలో కలకలం రేగింది. అసలు సిద్ధాంతిని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు, అసలు అంత అవసరం ఎవరికి ఉందనేది చర్చించుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం విజయవాడ టాస్క్ఫోర్సు పోలీసులు తీసుకువెళ్ళి ఉంటారని భావిస్తున్నారు. సిద్ధాంతి వీరభద్రరావు నిడదవోలు రైల్వే చీఫ్ బుకింగ్ సూపర్వైజర్గా ఆరు నెలల క్రితం పదవీ విరమణ చేశారు. పట్టణంలో పదవీ విరమణ కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా నిర్వహించారు. సిద్ధాంతిగా రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వీరభద్రరావు పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి ఎంపీలు, న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. గతంలో డీజీపీ స్థాయి అధికారి కూడా యాగం చేయించుకున్నారు. ఎవరితో విరోధాలు కూడా లేని వీరభద్రరావును కీలకమైన అంశంలో టాస్క్ఫోర్సు పోలీసులు తీసుకువెళ్ళారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయనను హైదరాబాద్ పోలీసులు తీసుకెళ్లి ఉంటారని కొందరు అనుమానిస్తున్నారు. -
జగన్ ప్రెస్ మీట్ కు ఇంటెలిజెన్స్ వ్యక్తి!
విజయవాడ: ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశానికి విలేకరుల ముసుగులో ఇంటెలిజెన్స్ సిబ్బంది హాజరయ్యారు. మీరు ఏ మీడియా అంటూ ఆ సిబ్బందిని వైఎస్ఆర్ సీపీ మీడియా సెల్ ప్రశ్నించినా వారివద్ద నుంచి సరైన సమాధానం రాలేదు. దాంతో వాళ్లు పాత్రికేయ ప్రతినిధులు కారని, పోలీసు విభాగం నుంచి వచ్చినవారని గుర్తించిన మీడియా సెల్.. వారిపై ఒత్తిడి తెచ్చినా ఇంటెలిజెన్స్ వ్యక్తి బయటకు వెళ్లేందుకు నిరాకరించాడు. అయితే ఇది కేవలం మీడియా సమావేశం మాత్రమే అని పార్టీ మీడియా సెల్ స్పష్టం చేసింది. చివరికి విషయం అందరి ముందు బయట పడటంతో అతడు బయటకు జారుకున్నాడు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.