
సాక్షి, హైదరాబాద్: నిమ్స్‌లో వ్యాక్సిన్ పంపిణీలో అవకతవకలు చోటుచేసుకున్నాయి. నిమ్స్‌లో 7వేల మంది అనర్హులకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిమ్స్‌లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం ఇంటలిజెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై నిమ్స్ డైరెక్టర్ మనోహర్ మాట్లాడుతూ..'' వ్యాక్సిన్ అవకతవకలపై విచారణ కొనసాగుతోంది. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడలేం. డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ కేవీ కృష్ణారెడ్డి పాత్రపైనా దర్యాప్తు జరుగుతోంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నాం. ఆధార్ కార్డు లేకుండా వ్యాక్సిన్ ఇస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. విజిలెన్స్ నివేదిక తర్వాత సర్టిఫికెట్ల జారీపై నిర్ణయం తీసుకుంటామని'' తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment