జగన్‌ ప్రెస్‌ మీట్‌ కు ఇంటెలిజెన్స్‌ వ్యక్తి! | inteligence person came to ys jagan mohan reddy pressmeet! | Sakshi
Sakshi News home page

జగన్‌ ప్రెస్‌ మీట్‌ కు ఇంటెలిజెన్స్‌ వ్యక్తి!

Published Wed, Mar 15 2017 5:51 PM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM

జగన్‌ ప్రెస్‌ మీట్‌ కు ఇంటెలిజెన్స్‌ వ్యక్తి! - Sakshi

జగన్‌ ప్రెస్‌ మీట్‌ కు ఇంటెలిజెన్స్‌ వ్యక్తి!

విజయవాడ: ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశానికి విలేకరుల ముసుగులో ఇంటెలిజెన్స్‌ సిబ్బంది హాజరయ్యారు. మీరు ఏ మీడియా అంటూ ఆ సిబ్బందిని  వైఎస్‌ఆర్‌ సీపీ మీడియా సెల్‌ ప్రశ్నించినా వారివద్ద నుంచి సరైన సమాధానం రాలేదు. దాంతో వాళ్లు పాత్రికేయ ప్రతినిధులు కారని, పోలీసు విభాగం నుంచి వచ్చినవారని గుర్తించిన మీడియా సెల్‌.. వారిపై ఒత్తిడి తెచ్చినా ఇంటెలిజెన్స్‌ వ్యక్తి బయటకు వెళ్లేందుకు నిరాకరించాడు. 

అయితే ఇది కేవలం మీడియా సమావేశం మాత్రమే అని పార్టీ మీడియా సెల్‌ స్పష్టం చేసింది. చివరికి విషయం అందరి ముందు బయట పడటంతో అతడు బయటకు జారుకున్నాడు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఈ రోజు సాయంత్రం ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement