వింత చర్యకు పాల్పడిన మతగురువు | Rajasthan Priest Mahant Anil Purohit Cut His Private Part | Sakshi
Sakshi News home page

వింత చర్యకు పాల్పడిన మతగురువు

Published Sun, Jun 17 2018 10:00 AM | Last Updated on Sun, Jun 17 2018 11:20 AM

Rajasthan Priest Mahant Anil Purohit Cut His Private Part - Sakshi

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనిల్ పురోహిత్‌

జైపూర్‌ : రాజస్థాన్‌లోని ఓ మతగురువు వింత చర్యకు పాల్పడ్డారు. సేవాగిరిదామ్‌కు చెందిన 40 ఏళ్ల మత గురువు మహంత్‌ అనిల్‌ పురోహిత్‌ తన జననాంగాన్ని కోసేసుకున్నారు. మత గురువు అనిల్‌ శుక్రవారం అర్ధరాత్రి తన గదిలోనే ఈ చర్యకు పాల్పడ్డారు. ఇటీవలి కాలంలో బాబాలు, స్వామిజీలపై తీవ్రమైన ఆరోపణలు వస్తుండటంతో మనస్తాపానికి గురైన ఆయన ఈ విధంగా చేసినట్టు తెలుస్తోంది. తన క్యారెక్టర్‌ను నిరూపించుకోవడానికే అతను ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. గాయపడ్డ అనిల్‌ను ఆయన అనుచరులు తొలుత స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. జైపూర్‌ తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు. అనిల్ ప్రస్తుతం జైపూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి అనిల్‌ నుంచి వివరాలు సేరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement