అర్చకుల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక | Dist priest commite election | Sakshi
Sakshi News home page

అర్చకుల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

Published Tue, Sep 20 2016 8:36 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

అర్చకుల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక - Sakshi

అర్చకుల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

నల్లగొండ కల్చరల్‌ : తెలంగాణ దేవాలయ అర్చక ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అర్చక సంఘం భవనంలో జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దౌలతాబాద్‌ వాసుదేవశర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య గౌరవ అధ్యక్షుడిగా దౌలతాబాద్‌ వాసుదేవశర్మ, నూతన అధ్యక్షుడిగా పోతులపాటి రామలింగేశ్వరశర్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అమరజవాన్లకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారావు, వైదిక బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు గుదె లకీS్ష్మనర్సయ్య, నాగరాజుశర్మ, పులిరామకృష్ణ శర్మ, కోడుగంటి వెంకటరమణశాస్త్రీ, నందిభట్ల నాగరాజు శర్మ, విశాలక్ష్మమ్మ, శ్రీనివాసశర్మ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement