commite
-
దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ
న్యూఢిల్లీ: పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా బహిర్గతమైన భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు కొత్త కమిటీ ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ రాష్ట్ర సర్కార్లు గతంలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన కమిటీల దర్యాప్తులను నిలిపివేస్తూ కొత్త కమిటీని సుప్రీంకోర్టు కొలువు తీర్చనుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత కేసు విచారణ సందర్భంగా సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చండీగఢ్ డీజీపీ, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఇన్స్పెక్టర్ జనరల్, పంజాబ్– హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. భవిష్యత్తులో భద్రతా వైఫల్యం పునరావృతం కాకుండా పటిష్ట రక్షణకు సూచనలు ఇచ్చేలా, ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరగాలంటూ లాయర్స్ వాయిస్ అనే సంస్థ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీల ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. కేంద్రం రాజకీయాలు చేస్తోంది ఘటనపై పంజాబ్ ఉన్నతాధికారులను మోదీ సర్కార్ లక్ష్యంగా చేసుకుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుకు హాజరైన అడ్వకేట్ జనరల్ డీఎస్ పట్వాలియా వాదించారు. ‘‘తప్పంతా పంజాబ్‌దే అని ఏకపక్షంగా తేల్చేస్తున్నారు. ఎలాంటి దర్యాప్తు, ఉత్తర్వులు లేకుండానే రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి మొదలుకుని సీనియర్ ఎస్పీల వరకు మొత్తంగా ఏడు షోకాజ్ నోటీసులు పంపించారు. తప్పు మాదే అయితే నన్ను, మా రాష్ట్ర అధికారులను ఉరి తీయండి. మా వాదన వినకుండానే వైఫల్యానికి బాధ్యుతలు మీరే.. అని నిర్ధారించకండి. ఈ అంశంలో మోదీ సర్కార్ రాజకీయాలు చేస్తోంది’’ అని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు కమిటీని ఉద్దేశిస్తూ పట్వాలియా వ్యాఖ్యానించారు. వైఫల్యాలు తేలాలంటే స్వతంత్ర కమిటీ తప్పనిసరి అని ఆయన అన్నారు. కోర్టు చేసేది ఏముంటుంది?: సుప్రీం పట్వాలియా వాదనలను తోసిపుచ్చుతూ కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ‘దేశ ప్రధాని భద్రత అనేది అత్యంత కీలక అంశం. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) బ్లూ బుక్, ఇతర నియమావళి ప్రకారమే పంజాబ్ ఉన్నతాధికారులకు నోటీసులు ఇచ్చాం’ అని ఆయన వివరణ ఇచ్చారు. దీనిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ‘ప్రధాని భద్రత ఎంత ముఖ్యమైన విషయమో మాకూ తెలుసు. దానికి తీవ్రమైన అంశంగానే పరిగణిస్తున్నాం. సంబంధిత అంశం కోర్టు పరిధిలోనే ఉంది. అలాంటపుడు షోకాజ్ నోటీసుల పేరిట రాష్ట్ర అధికారులపై మీరెందుకు క్రమశిక్షణ చర్యలకు బయల్దేరారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించారు. మీరే దర్యాప్తు కొనసాగిస్తున్నపుడు మళ్లీ కోర్టుకెందుకు వచ్చారు. ఈ కోర్టు చేసేది ఏముంటుంది? ’అని తుషార్ మెహతాతో జడ్జీలు వ్యాఖ్యానించారు. మరోవైపు, వైఫల్యం ఘటనలో పంజాబ్ సీఎం, పంజాబ్ సీఎస్, డీజీపీ, ఫిరోజ్‌పూర్ ఎస్‌ఎస్‌పీల పాత్రను బయటపెట్టేలా ఎన్ఐఏ అధ్యర్వంలో దర్యాప్తు కొనసాగించాలని కోరుతూ లాయర్ వరుణ్ సిన్హా సుప్రీంకోర్టులో పిల్ వేశారు. -
హోంగార్డుల సమస్యలపై కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హోంగార్డులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసినట్లు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. హోంగార్డుల రెగ్యులరైజేషన్‌పై ముఖ్యమంత్రి ఆలోచన చేశారని.. రెగ్యుల రైజేషన్‌కు అర్హత లేనివారిని హోంగార్డులుగానే కొనసాగించాలా, క్లాస్–4 ఉద్యోగులుగా మార్చాలా అనే అంశాలను చర్చిస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం శాసన మండలిలో పోలీసు శాఖ ఆధునికీకరణపై జరిగిన లఘు చర్చలో మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రాంచందర్‌రావు, సుంకరి రాజు, రాములు నాయక్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు నాయిని సమాధానమిచ్చారు. హోంగార్డుల వేతనాలను కూడా రూ.12 వేలకు పెంచామని గుర్తు చేశారు. విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు చేపడితే కోర్టుల్లో కేసులు వేస్తున్నారన్నారు. ‘ఓవైపు రెగ్యులరైజ్ చేయాలంటూ మరోవైపు కేసులు పెడుతూ అడ్డుకుంటున్నారు.. ఇదేం పద్ధతయ్యా..!’అని విమర్శించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ కల్పించుకొని న్యాయం జరగని వారు కోర్టుకు వెళతారని, కోర్టును ఎలా తప్పు పడతారని ప్రశ్నించారు. -
అర్చకుల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
నల్లగొండ కల్చరల్ : తెలంగాణ దేవాలయ అర్చక ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అర్చక సంఘం భవనంలో జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దౌలతాబాద్ వాసుదేవశర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య గౌరవ అధ్యక్షుడిగా దౌలతాబాద్ వాసుదేవశర్మ, నూతన అధ్యక్షుడిగా పోతులపాటి రామలింగేశ్వరశర్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అమరజవాన్లకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారావు, వైదిక బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు గుదె లకీS్ష్మనర్సయ్య, నాగరాజుశర్మ, పులిరామకృష్ణ శర్మ, కోడుగంటి వెంకటరమణశాస్త్రీ, నందిభట్ల నాగరాజు శర్మ, విశాలక్ష్మమ్మ, శ్రీనివాసశర్మ తదితరులు పాల్గొన్నారు. -
పథకాలపై ప్రచారంలేదు
సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి శిద్దా కావలిఅర్బన్ : ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు క్షేత్రస్థాయిలో తగినంత ప్రచారంలేదని రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి శిద్దా రాఘవరావు అసంతప్తి వ్యక్తంచేశారు. గురువారం నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ కావలి నియోజకవర్గ సమన్వయ కమిటీ జరిగింది. ఇందులో పాల్గొన్న శిద్దా మాట్లాడుతూ పథకాలు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సక్రమంగా అందేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కషిచేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, పార్టీ పరిశీలకులు గూడూరు ఎరిక్సన్ బాబు, నాయకులు పాలడుగు రంగారావు, తాళ్లూరు మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు. -
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిగా శేఖర్
కరీంనగర్ : సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిగా బండారి శేఖర్, ప్రధానకార్యదర్శిగా ఎరవెల్లి ముత్యంరావు ఎన్నికయ్యారు. సిరిసిల్లలో గత రెండు రోజులుగా జరిగిన సీఐటీయూ మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎన్.సాయిబాబు, కార్యదర్శులు పాలడుగు భాస్కర్, పి.జయలక్ష్మి సమక్షంలో ఎన్నుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, జ్యోతి, ముకుందరెడ్డి, తిరుపతి, వనజారాణి, కార్యదర్శులుగా జేవీ.రమణారెడ్డి, మూషం రమేశ్, రామాచారి, ఎడ్ల రమేశ్, కె.శంకర్, రామగిరి తులసి, ఎగమంటి ఎల్లారెడ్డి, కోశాధికారిగా రాజేశంలను ఎన్నుకున్నారు. 32 మందితో వర్కింగ్ కమిటీని, అన్ని మండలాల, రంగాల ప్రతినిధులతో కౌన్సిల్‌ను ఎన్నుకున్నారు.