
గుండెపోటుతో పురోహితుడి మృతి
మైలవరానికి చెందిన సూరె రంగారావు(57)అనే పురోహితుడు గుండెపోటుతో మృతిచెందాడు.
మైలవరం(కృష్ణాజిల్లా): మైలవరానికి చెందిన సూరె రంగారావు(57)అనే పురోహితుడు మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. మైలవరం నుంచి ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం ఘాట్ వద్దకు బస్సులో వస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో బాధితుడిని సమీప ఆసుపత్రికి బస్సు డ్రైవర్ తీసుకువచ్చాడు. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే రంగారావు మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.