నగ్నంగా ఊరేగింపు.. యాసిడ్‌ విసిరారు | Belagavi Priest Naked Parade Supporters Threw Acid | Sakshi
Sakshi News home page

May 31 2018 11:27 AM | Updated on Oct 16 2018 8:34 PM

Belagavi Priest Naked Parade Supporters Threw Acid  - Sakshi

సాక్షి, బెంగళూరు: మహిళా భక్తులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న పూజారిని చితకబాది, నగ్నంగా ఊరేగించారు స్థానికులు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.  బెలగావిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...

షంబాజీ రోడ్‌లోని కపిలేశ్వర ఆలయ పూజారి గోపాలయ్య(రామ పూజారి) గత కొంత కాలంగా గుడికొచ్చే మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయంలో కొందరు గోపాలయ్యను హెచ్చరించినప్పటికీ లాభం లేకుండా పోయింది. సోమవారం సాయంత్రం గుడికొచ్చిన ఓ భక్తురాలిపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన స్థానికులు అతన్ని చితకబాది ప్యాంట్‌ ఊడదీయించి ఊరేగించారు. ఆ వీడియోలు స్థానికంగా పలు ఛానెళ్లలో ప్రసారం అయినట్లు టౌమ్స్‌ నౌ ప్రచురించింది. అయితే ఈ క్రమంలో గోపాలయ్య అనుచరులు కొందరు యాసిడ్‌ దాడికి దిగినట్లు ఆ కథనం పేర్కొంది.

ఊరేగింపు కొనసాగుతుండగానే గోపాలయ్యపై దాడికి పాల్పడ్డ కొందరు యువకులపై  యాసిడ్‌ బాటిళ్లను విసిరారు. ఈ ఘటనలో పలువురుకి తీవ్ర గాయాలు కాగా,  ఆ దృశ్యాలు కూడా వాట్సాప్‌ గ్రూప్‌లలో చక్కర్లు కొట్టాయి. స్థానికులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇప్పటికే పలువురురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement