నిందితుడు గోపాల్‌రావు
మారేడుపల్లి: ఇళ్లల్లో పూజలు చేస్తూ నమ్మకంగా నటిస్తూ చోరీలకు పాల్పడుతున్న పూజారిని మారేడుపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డీఐ అప్పలనాయుడు ఆదివారం కేసు వివరాలు వెల్లడించారు. మారేడుపల్లి సామ్రాట్ కాలనీకి చెందిన గోపాలరావు (38) పౌరోహిత్యం నిర్వహిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా అతను వెస్ట్ మారేడుపల్లికి చెందిన బెల్పు జనార్దన్‌రావు ఇంట్లో పూజలు చేస్తూ వారి ఇంట్లో నమ్మకం సంపాదించుకున్నాడు. 2017 ఏప్రెల్‌లో జనార్దన్ రావు ఇంట్లో చోరీ జరగడంతో బాధితుడు మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు గోపాల్‌రావుపై అనుమానం వ్యక్తం చేయగా జనార్దన్ రావు కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు.
గత నెల 16న మరో సారి జనార్దన్ రావు తల్లి సత్యభామ గదిలో పర్సు మాయమైంది. అందులో 40 తులాల బంగారం, ఏటీఎం కార్డు, లాకర్ తాళాలు ఉన్నట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 27 నుంచి ఈ నెల 6 వరకూ మారేడుపల్లిలోని పలు ఏటీఎంల నుంచి నగదు డ్రా చేసినట్లు గుర్తించిన పోలీసులు ఏటీఎంలలోని సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితుడు పూజారి గోపాల్ రావుగా గుర్తించా రు. ఆదివారం అతడిని అరెస్టు చేసి, 40 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు, లాకర్ తాళం చెవి స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసులను చేధించిన మహాంకాళీ ఏసీపీ వినోద్‌కుమార్, సీఐ శ్రీనివాసులు, డీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ సుబ్బారెడ్డిలను, డీసీపీ సుమతి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment