కరోనాతో టీటీడీ అర్చకుడు మృతి | Tirumala Priest Srinivasa Charyulu Dead With Coronavirus | Sakshi
Sakshi News home page

తిరుమలలో విషాదం: కరోనాతో అర్చకుడు మృతి

Aug 6 2020 7:16 PM | Updated on Aug 6 2020 7:57 PM

Tirumala Priest Srinivasa Charyulu Dead With Coronavirus - Sakshi

సాక్షి,తిరుపతి: తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి బారినపడి మరో అర్చకుడు మృతి చెందారు. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న టీటీడీ అర్చకుడు ఎన్వీ శ్రీనివాసాచార్యులు (45) కరోనాతో కన్నుమూశారు. గోవిందరాజు స్వామి ఆలయం నుంచి శ్రీనివాసాచార్యులు డిప్యూటేషన్‌పై తిరుమలకు వచ్చారు. వారం క్రితం ఆయనకు కరోనా వైరస్‌ రావడంతో తిరుపతి స్విమ్స్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి చెందిన విషయం తెలిసిందే.  ఆయన తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడిగా దాదాపు 20 ఏళ్లకు పైగా కొనసాగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement