- బాబాయిని కొట్టి చంపిన కుమారుడు
- బైరాన్‌పల్లిలో విషాదం
అర్చకుడు.. హంతకుడు
Published Wed, Aug 17 2016 11:54 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
మద్దూరు : దేవుడి గుడిలో నిత్యం పూజలు చేసే చేతులు ఓ వ్యక్తి ప్రాణాలు తీశాయి. అర్చకుడి చేతిలో ఓ విశ్రాంత ఉపాధ్యాయు డు హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మండలంలోని బైరాన్‌పల్లిలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికుల కథ నం ప్రకారం.. మద్దూరు మండలంలోని బైరాన్‌పల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు గుడ్డం లింగయ్య(72)కు, అతడి అన్న కుమారుడైన స్థానిక అంగడి వీరన్న దేవాలయ పూజారి గుడ్డం ఈశ్వరయ్యకు గ్రామ శివారులో పక్క పక్కనే వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ క్రమంలో తాను సాగు చేసిన మొక్కజొన్న చేనును కోతుల బారి నుంచి రక్షించేందుకు లింగయ్య మంగళవారం కంచె వేసుకున్నాడు.
అదే రోజు సాయంత్రం తనకున్న భూమిలో కంచె వేశాడని ఈశ్వరయ్య ఆ కంచెను తొలగించాడు. ఈ విషయమై బుధవారం తెల్లవారుజామున లింగయ్య తన పాలేరు దేవులపల్లి నర్సయ్యతో కలిసి ఈశ్వరయ్య ఇంటికి వెళ్లి నిలదీశాడు. అప్పటికే ఇంట్లో పూజ చేస్తున్న ఈశ్వరయ్య కోపంతో పక్కనున్న కర్రతో బయటికి వచ్చి లింగయ్య తలపై బాదాడు. దీంతో పక్కనే ఉన్న నర్సయ్య భయంతో పరుగు పెట్టి లింగయ్య కుమారుడు వీరభద్రంకు సమాచారం అందించాడు. వాళ్లు వచ్చే లోపే చుట్టుపక్కల వాళ్ల కేకలతో ఈశ్వరయ్య పారిపోయాడు. దీంతో రక్తపుమడుగులో ఉన్న లింగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడికి ముగ్గురు భార్యలు ఉండగా.. గతంలో ఒక భార్య అనారోగ్యంతో చనిపోయింది.
భార్యలు ఈశ్వరమ్మ, సోమేశ్వరమ్మ, కుమారుడు వీరభద్రం, కూతురు ఉన్నారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చం ద్రశేఖర్, ఎస్సై తిరుపతి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేర్యాలకు తరలించారు. కాగా, ఈశ్వరయ్య పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది.
Advertisement