కోడేరు : బాలికను స్టేట్‌హోంకు తరలిస్తున్న అధికారులు
సాక్షి, నారాయణపేట రూరల్: అవగాహన రాహిత్యంతో నారాయణపేట డివిజన్‌లో ఎక్కువగా బాల్యవివాహాలు చేçయడానికి సిద్ధమవుతున్నారని, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తే రహస్యంగా తిరిగి పెళ్లిళ్లు చేసినట్లు సమాచారం వస్తుందని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. గురువారం పేటలో పలు కార్యక్రమాలకు హాజరైన ఆయన బాల్యవివాహాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేసులు నమోదు చేస్తేనే మార్పు కనిపిస్తుందని ముందు పెళ్లి చేసిన పూజారిపై కేసు నమోదు చేయాలన్నారు.
ఇటీవల దామరగిద్ద మండలం కంసాన్‌పల్లికి చెందిన అమ్మాయిని మద్దూరు మండలంలోని ఓ అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారని, కౌన్సిలింగ్ ఇచ్చినా తిరిగి పెళ్లి చేయడంపై సీరియస్ అయ్యారు. వెంటనే ఇరువురి కుటుంబ సభ్యులు, పెళ్లికి హాజరైన అందరిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అంతకు ముందు భూమిక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు బాల్యవివాహాలపై మాట్లాడారు.
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
కోడేరు (కొల్లాపూర్): మండలంలోని రాజాపూర్‌లో జరుగుతున్న బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన శివతో పెద్దకొత్తపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో ఈ నెల 25న వివాహం జరిపారు. చిన్నతనంలో పెళ్లి చేశారని సీడబ్ల్యూఎస్ దశరథం ఐసీడీఎస్ సీడీపీఓ జ్యోతి, ఏఎస్‌ఐ ఇస్మాయిల్‌కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని బాలికను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడి నుంచి స్టేట్‌హోంకు తరలించారు. మండలంలో ఎవరైనా బాల్యవివాహాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment