
బాలీవుడ్‌లో ఐటం సాంగ్స్‌తో అల్లాడించింది సన్నీలియోన్. హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ, మరాఠి, బెంగాలి, మలయాళ భాషల్లోనూ పలు పాటల్లో తళుక్కుమని మెరిసింది. ఈమె తెలుగులో చివరగా జిన్నా సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఎనిమిది సినిమాలున్నాయి. ఇందులో ఒకటి స్పెషల్ సాంగ్ కాగా మిగతా వాటిలో కీలక పాత్రలు పోషిస్తోంది. అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యే స్ప్లిట్స్‌విల్లా ఐదో సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.
నాకు డౌట్ వచ్చి..
తాజాగా ఆమె ఈ షోలో తన మనసు ముక్కలైన క్షణాలను గర్తు చేసుకుంది. 'ఇది నా పెళ్లికి ముందు జరిగిన సంఘటన. ఒక వ్యక్తిని ఎంతో ప్రేమించాను. ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నాం. కానీ అతడు నన్ను మోసం చేస్తున్నాడేమోనని మనసు కీడు శంకించింది. ఒకసారి తననే నేరుగా అడిగేశాను.. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అని! దానికతడు లేదు, నీ మీద ప్రేమ ఎప్పుడో పోయిందని చెప్పాడు. కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. అప్పటికే మా పెళ్లి షాపింగ్ కూడా అయిపోయింది.
అన్నీ బుక్ చేసేశా
హవాయి దీవుల్లో గ్రాండ్‌గా, జీవితాంతం గుర్తుండిపోయేలా వివాహం జరగాలని ప్లాన్ చేసుకున్నాం. ఇందుకోసం అన్నీ బుక్ చేసుకుని డబ్బులు కూడా ఇచ్చేశాను. పెళ్లికి ఇంకా రెండు నెలల సమయం ఉందనగా నేనంటే ఇష్టం లేదని చెప్పి నా మనసు ముక్కలు చేశాడు. అప్పుడు నేనెంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నించాను. ఆ సమయంలోనే దేవుడు నాకోసం వెబర్‌ను పంపాడు.
అండగా నిలబడ్డాడు
కష్టసమయాల్లో అండగా నిలబడ్డాడు. అమ్మానాన్న మరణించినప్పుడు నావెంటే ఉండి నాలో ధైర్యం నింపాడు. ఎప్పటికీ నా భర్త చేయి వదలను' అని చెప్పుకొచ్చింది. కాగా సన్నీ లియోన్ - డేనియల్ వెబర్ 2011లో పెళ్లి చేసుకున్నారు. 2017లో నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాది సరోగసి ద్వారా నోవా, ఆషర్ అనే కుమారులకు తల్లిదండ్రులయ్యారు.
చదవండి: ‘కాంట్రవర్సీ కింగ్’ ఆర్జీవీ గురించి ఈ విషయాలు తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment