
సన్నీ లియోన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె లేటెస్ట్ ఫోటో నిరాడంబరమైన అమాయకపు ముస్తాబుతో ఆకట్టుకుంటోంది. అంచులకు రింకులు కుట్టిన తెలుపు రంగు స్లీవ్‌లెస్‌లో ఆమె మేఘమాలికను తలపిస్తున్నారు. కనుబొమల్ని దట్టమైన నలుపు రంగుతో తీర్చిదిద్దుకున్నారు. పెదవులకు లేత గులాబీ రంగు లిప్‌స్టిక్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చుకున్నారు. అంతా ప్రెష్ లుక్. స్టన్నింగ్‌గా ఉన్నారు సన్నీలియోన్. పెద్దగా శ్రమించకుండా ప్రపంచాన్ని మంత్రముగ్ధం చేసేందుకు టిప్స్ ఏవైనా కావాలనుకునే వారు సన్నీని సోషల్ మీడియాలో వెంటాడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment