
డా.యోగేష్, ఆకృతి అగర్వాల్ జంటగా సన్నీ లియోన్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘డాక్టర్ యోగి డైరీస్’. రాజేశ్ -ప్రసాద్‌ల దర్శకత్వంలో హర్షవర్ధన్, శ్రీదేవి మద్దాలి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవంలో తొలి సీన్‌కి దర్శకుడు వీరశంకర్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు వీఎన్ ఆదిత్య కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు మహేశ్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా హర్షవర్దన్ మాట్లాడుతూ..‘రాజేష్ - ప్రసాద్ లు కథ చెప్పగానే లైవ్ లో ఇలా కూడా జరుగుతుందా అనే ఆశ్యర్యానికి లోనయ్యాను.. అంతలా కథతో ఇప్రేస్ చేశారు. ప్రతిదీ చాలా ప్లానింగ్ గా వర్క్ చేస్తున్నారు. 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చెయ్యటానికి ప్లాన్ చేశాం’ అన్నారు. ‘ఈ ఏడాది ప్రేక్షకులు ఓ మంచి పారా నార్మల్ థ్రిల్లర్‌ను చూస్తారు’అని అన్నారు డా.యోగేష్
Comments
Please login to add a commentAdd a comment