
చండీగఢ్ : పంజాబ్‌లో బీజేపీకి సరైన అభ్యర్ధులు దొరకలేదని హోషియార్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్ధి రాజ్ కుమార్ చబ్బేవాల్ విమర్శించారు. పంజాబ్‌లో మూడు స్ధానాలకు కాషాయ పార్టీకి అభ్యర్ధులే కనిపించకపోవడంతో గురుదాస్‌పూర్ నుంచి సన్నీ డియోల్‌ను బరిలో దింపారని అన్నారు.
బీజేపీ సన్నీడియోల్‌ను తెచ్చినా, సన్నీ లియోన్‌ను తీసుకువచ్చినా కాంగ్రెస్ పెనుతుఫాన్ ముందు నిలవలేరని ధీమా వ్యక్తం చేశారు. మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన ఆరోపించారు. కాగా పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికల తుది విడత పోరులో భాగంగా మే 19న పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment