
ఫిల్మిటీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై గాయత్రి సురేష్, వివేకానందం కలిసి నిర్మించిన కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది. వివేక్ కుమార్ కర్నూల్ దర్శకత్వం వహించగా... ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్, గాయత్రి రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. డ్రమ్స్ శివమణి సంగీతమందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'కొటేషన్ గ్యాంగ్' అనే ఈ చిత్రం డిసెంబర్ రెండో వారంలో థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ అశ్వినికి ఆల్రెడీ పెళ్లయిందా? మరి అలా!)
చెన్నైలోని ఓ స్టూడియోలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. ఆసక్తికర విషయాల్ని బయటపెట్టారు. కేరళలో కొటేష న్ గ్యాంగ్ ఉన్నారనే వార్త పేపర్‌లో చదివానని, దాన్ని బేస్ చేసుకుని తయారు చేసుకున్న కథతో ఈ సినిమా తీశానని డైరెక్టర్ వివేక్ చెప్పుకొచ్చారు.
చెన్నై, ముంబై, కశ్మీర్‌లో జరిగే మూడు కథలు ముంబైలో కలుస్తాయని, డబ్బు కోసం ఎలాంటి పనైనా ఆలోచించకుండా చేసే కూలీ ముఠా ఇతివృత్తమే కొటేషన్ గ్యాంగ్ చిత్రమని దర్శక నిర్మాతలు చెప్పారు. ప్రియమణి చేసే ఫైట్స్ ఆకట్టుకుంటాయని చెప్పారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.
(ఇదీ చదవండి: హీరోగా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' కంటెస్టెంట్)
Comments
Please login to add a commentAdd a comment