
ఒకప్పటి శృంగార తార, ప్రస్తుతం వెండితెరపై అందాల ఆరబోతతో కుర్రకారులో వేడి పుట్టిస్తోంది సన్నీలియోన్. ఆమె పేరు తెలియని ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారికి ఆమె సుపరిచితురాలే. గూగుల్ సర్చ్‌లో ప్రతీ యేటా టాప్‌లో ఉండే ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఇంట్లో తన భర్త డానియల్ వెబర్.. బూబ్ల అని ముద్దుగా పిలుస్తాడని చెప్పుకొచ్చింది. మైఖేల్ జోర్డాన్ తన ఫస్ట్ క్రష్ అని పేర్కొంది. ఇక ఇంతవరకు తను నటించిన వారందరిల్లో కెల్లా.. ఎవరితో ముద్దు సన్నివేశాల్లో నటించడం సరదాగా ఉందనే ప్రశ్నకు.. నా భర్తలా ఎవరూ బాగా కిస్ చేయలేరు అంటూ వెంటనే సమాధానమిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment