
Sunny Leone Try To Scare Manchu Vishnu: సన్నీలియోన్, మంచు విష్ణుకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సన్నీలియోన్, విష్ణును భయపెట్టేందుకు ప్రయత్నించింది. కానీ విష్ణు ఆమె ప్లాన్‌ను తిప్పికొట్టి సన్నీ ఏడిపించాడు. కాగా మంచు విష్ణు తాజాగా నటిస్తున్న చిత్రం గాలి నాగేశ్వరరావు. ఇందులో సన్నీ లీయోన్ రేణుకా పాత్ర పోషిస్తన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ను జరపుకుంటోంది. ఈ క్రమంలో షూటింగ్ బ్రేక్‌లో సన్నీ, విష్ణును ఆటపట్టించేందుకు గోడ చాటున్న దక్కుంది. ఆమె సిగ్నేచర్ మాస్క్ ధరించి అటూగా వస్తున్న విష్ణును భయపెట్టాలని చూసింది.
కానీ విష్ణు మాత్రం మాస్క్‌తో ఉన్న సన్నీని చూసి ఏమాత్రం దడుచుకోకుండా సాధారణంగా ఆమెను చూస్తు నిలబడ్డాడు. దీంతో ఆమె మాస్క్ తీయగా విష్ణు ఒక్కసారిగా తనని చూసి భయంతో వణికిపోతూ అక్కడి నుంచి పరుగు తీశాడు. దీంతో వెంటనే ఆమె విష్ణు వెంట పెరుగెత్తిన ఈ వీడియోను సన్నీ లీయోన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనికి ‘మరోసారి నా ప్రయత్నం విఫలమైంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక సన్నీలియోన్ షేర్ చేసిన ఈ పోస్ట్‌కు బాడ్మింటన్ పీవీ సింధు కామెంట్ చేసింది. నవ్వు ఆపుకోలేకపోతున్నానంటూ నవ్వుతున్న ఎమోజీలతో తన స్పందనను తెలిపింది.
అలాగే వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. గాలి నాగేశ్వరరావు మూవీకి ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందు గాలి నాగేశ్వరరావుగా విష్ణు కనిపించనున్నాడు. అతడి విష్ణు క్యారెక్టర్ డిజైన్ చేసిన స్కెచ్‌ను ఇటీవల ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే సన్నీ స్కెచ్ కూడా రిలీజ్ అయ్యింది. అందులో సన్నీ రేణుక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకి ఫేమస్ రైటర్ కోన వెంకట్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment