
హీరో విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా సింగర్స్‌గా పరిచయమవుతున్నారు. మంచు విష్ణు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డా.మంచు మోహన్‌బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించి, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్.
(చదవండి: కమల్ హాసన్ నుంచి అది నేర్చుకున్నా: సాయిపల్లవి)
ఈ చిత్రంలో గాలి నాగేశ్వరరావు అనే మాస్ పాత్ర చేస్తున్నారు విష్ణు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఓ పాటను అరియానా, వివియానా పాడారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాట సినిమాలో కీలక సందర్భంలో వస్తుంది. ఈ చిత్రానికి కెమెరా: ఛోటా.కె. నాయుడు, మూల కథ: జి.నాగేశ్వరరెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment