viviana
-
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. మోహన్ బాబు మనవరాళ్లను చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. ఈ మూవీ భారీ బడ్జెట్‌తో అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. ఇటీవలే మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.తాజాగా మరో అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీలో మోహన్ బాబు మనవరాళ్లు అరియానా, వివియానా కూడా నటిస్తున్నారు. వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను కన్నప్ప టీమ్ రివీల్ చేసింది. ఈ మూవీ ద్వారా మోహన్ బాబు మనవరాళ్లు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. వీరి ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. ఇప్పటికే రిలీజైన కన్నప్ప టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, స్టన్నింగ్ విజువల్స్‌తో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. Immerse yourself in the spirit of devotion with #Ariaana & #Viviana Manchu, and witness their full-look in #Kannappa🏹 — A perfect blend of talent and spirituality dedicated to Lord Shiva.🎬✨#HarHarMahadevॐ @themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas @akshaykumar… pic.twitter.com/vquzPB6b6s— Kannappa The Movie (@kannappamovie) December 2, 2024 -
Vivianne Robinson: ఒలింపిక్స్ ఇంటిపేరయింది
మనసు ఉంటే మార్గమే కాదు ‘మనీ’ కూడా ఉంటుంది. ‘అదెలా!’ అని ఆశ్చర్యపడితే... వివియానా రాబిన్సన్ గురించి తెలుసుకోవాల్సిందే. ‘ఒలింపిక్స్’ అనే మాట వినబడగానే ఆమె ఒళ్లు పులకించి΄ోతుంది. ప్రపంచ సంగ్రామ క్రీడను టీవీలో కాదు ప్రత్యక్షంగా చూడాలనేది ఆమె కల. అలా కల కని ఊరుకోలేదు. ఒక్కసారి కాదు ఏడుసార్లు ఒలింపిక్స్ వెళ్లింది... అలా అని ఆమె సంపన్నురాలేం కాదు. చాలా సామాన్యురాలు.ఒలింపిక్స్‌పై ఆసక్తి రాబిన్సన్కు 1984 ఒలింపిక్స్ సమయం లో మొదలైంది. ఆమె తల్లి ‘యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా’లో అథ్లెట్లకు ట్రాన్స్‌లేటర్‌గా ఉండేది. తల్లి నోటినుంచి ఒలింపిక్స్‌కు సంబంధించి ఎన్నో విషయాలు, విశేషాలు వినేది. ఆ ఆసక్తి రాబిన్సన్ను అట్లాంటా ఒలింపిక్స్‌కు వెళ్లేలా చేసింది.‘ఇప్పటిలా అప్పట్లో అథ్లెట్స్‌కు హైసెక్యూరిటీ ఉండేది కాదు. దీంతో ఎంతోమంది అథ్లెట్స్‌తో మాట్లాడే అవకాశం దొరికేది. కాని ఇప్పుడు సమీపంలోకి కూడా వెళ్లే పరిస్థితి లేదు’ అని ఆరోజులను గుర్తు చేసుకుంటుంది రాబిన్సన్.లాస్ ఏంజెల్స్, అట్లాంటా, సిడ్నీ, ఏథెన్స్, లండన్, రియో డి జెనీరోలతో పాటు తాజాగా ప్యారిస్ ఒలిపింక్స్‌కు కూడా వెళ్లింది.స్థలం కొనడానికో, ఇల్లు కొనడానికో, భవిష్యత్ అవసరాల కోసమో సాధారణంగా డబ్బు పొదుపు చేస్తారు. కాని రాబిన్సన్ మాత్రం ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని డబ్బు పొదుపు చేస్తుంది. రోజుకు రెండు ఉద్యోగాలు చేసింది. ప్రస్తుత ప్యారిస్ ఒలింపిక్స్ కోసం కూడా ఎప్పటినుంచో పొదుపు మంత్రం పాటించింది.ఒలింపిక్ థీమ్డ్ ట్రాక్సూట్తో ప్యారిస్‌లో టూరిస్ట్‌లు, వాలెంటీర్లకు ప్రత్యేక ఆకర్షణగా మారింది రాబిన్సన్. ఎంతోమంది ఆమెతో కలిసి సెల్ఫీలు దిగుతున్నారు. కొందరు ఆమె పాపులర్ టిక్‌టాక్ వీడియోల గురించి మాట్లాడుతుంటారు.‘సాధారణ దుస్తుల్లో కంటే ఇలాంటి దుస్తుల్లో కనిపించడం వల్ల నాతో మాట్లాడటానికి ఉత్సాహం చూపుతారు’ అంటుంది తన ప్రత్యేక వేషధారణ గురించి చెబుతూ. ఒలింపిక్స్ పుణ్యమా అని ప్రఖ్యాత అథ్లెట్లతో పాటు టామ్ క్రూజ్, లేడీ గాగా లాంటి సెలబ్రిటీ ఆర్టిస్ట్‌లతో కూడా మాట్లాడే అవకాశం వచ్చింది.ఆరంభంలో ఉన్న ఉత్సాహం ఆ తరువాత ఉండక΄ోవచ్చు. అయితే 66 సంవత్సరాల వయసులోనూ రాబిన్సన్ కు ఒలిపింక్స్పై ఆసక్తి తగ్గలేదు.‘డబ్బును పొదుపు చేస్తూ నేను బతికి ఉన్నంత వరకు ఒలింపిక్స్‌కు వెళుతూనే ఉంటాను’ అంటుంది మెరిసే కళ్లతో రాబిన్సన్. అయితే నెక్స్›్టఒలింపిక్స్ కోసం ఆర్థికరీత్యా రాబిన్సన్ అంతగా కష్టపడక్కర్లేదు. ఎందుకంటే తన హోమ్టౌన్ లాస్ ఏంజెల్స్‌లోనే అవి జరగనున్నాయి.వివియానా రాబిన్సన్ పేరుతో ఎంతోమంది ్రపొఫెసర్లు, రచయితలు, రకరకాల వృత్తుల వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘ఒలింపిక్స్’ అనేది రాబిన్సన్ ఇంటి పేరు అయింది. ఆటల ప్రేమికులు, గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లకు వివియానా రాబిన్సన్ అనే కంటే ‘ఒలింపిక్స్ రాబిన్సన్’ అంటేనే సుపరిచితం.ఒలింపిక్స్ డైరీస్ఒక్కసారి ఒలింపిక్స్‌కు వెళ్లొస్తేనే ఆ అనుభవం ‘ఆహా ఓహో’ అనిపిస్తుంది. అలాంటిది ఏడుసార్లు వెళ్లడం అంటే అంతులేని అనుభూతి. అలాంటి అనుభూతిని సొంతం చేసుకుంది రాబిన్సన్. అథ్లెట్లకు లక్ష్యం మాత్రమే, వాలెంటీర్లకు వారు చేస్తున్న పని మాత్రమే కనిపిస్తుంది. అయితే ప్రేక్షకులుగా వెళ్లాలనుకునే వారికి మాత్రం 360 డిగ్రీల కోణంలో ఒలింపిక్స్ అనుభూతి సొంతం అవుతుంది. ఏడు ఒలింపిక్‌ల జ్ఞాపకాల సంపదను వృథా చేయవద్దు అంటున్నారు రాబిన్సన్ స్నేహితులు. సామాన్య ప్రేక్షకురాలిగా తాను చూసిన అనుభవాలను గ్రంథస్తం చేస్తే అదొక విలువైన గ్రంథం అవుతుంది. డైరీలలో దాగి ఉన్న ఆమె ఒలింపిక్ అనుభవాలు ఏదో ఒకరోజు పుస్తకరూపం దాల్చుతాయని ఖాయంగా చెప్పవచ్చు. -
ఊహించని సర్ప్రైజ్.. ఏడ్చేసిన మంచు విష్ణు
టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు ఆయన కూతుళ్లు అరియానా, వివియానా. బుధవారం (మార్చి 1న) మంచు విష్ణు- విరానికలు 15వ పెళ్లిరోజు జరుపుకున్నారు. పేరెంట్స్ పెళ్లిరోజును పురస్కరించుకుని వారికి మర్చిపోలేని బహుమతిచ్చారు అరియానా, వివియానా. వారికోసం ఓ బ్యూటిఫుల్ సాంగ్ ఆలపించారు. అంతే కాకుండా వారి వివాహబంధంతో మొదలైన ప్రయాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. విష్ణు దంపతుల ఫోటోలు, వీడియోలను ఒక స్పెషల్ వీడియోగా బయటకు వదిలారు. ఇది చూసి మంచు విష్ణు భావోద్వేగానికి లోనయ్యాడు. సదరు వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ ఎమోషనలయ్యాడు. 'ఈ పాట పూర్తయ్యే సమయానికి నాకు తెలియకుండానే కంట్లో నుంచి నీళ్లు వచ్చేశాయి. నా డార్లింగ్ పిల్లలకు థాంక్యూ.. నా జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేశారు. నాకు, విరానికకు కలిపి ఇచ్చిన ఈ సర్ప్రైజ్ గిఫ్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను' అని రాసుకొచ్చాడు. ఈ వీడియోపై జెనీలియా స్పందిస్తూ.. 'అద్భుతంగా ఉంది విష్ణు. నీ పిల్లలు చాలా గొప్పవాళ్లు' అని కామెంట్ చేసింది. I started crying towards the end of the song. Thank you my darling #Ariaana #Viviana, my little mommies ❤️❤️❤️❤️❤️. This has made my day and I will never forget this surprise gift for @vinimanchu and me. pic.twitter.com/RZI13tazny — Vishnu Manchu (@iVishnuManchu) March 1, 2023 -
Ginna: మంచు విష్ణు కూతుళ్ల ‘ఫ్రెండ్షిప్’ సాంగ్ వచ్చేసింది
మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఓ పాటను మంచు విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా పాడారు. తాజాగా చిత్ర యూనిట్ ఆ పాటని విడుదల చేశారు. (చదవండి: ‘రుద్రమదేవి’ బాలనటి ఇప్పుడేం చేస్తుందో తెలుసా?) ‘ఇది స్నేహం’ అంటూ సాగే ఈ పాటకు భాస్కర పట్ల లిరిక్స్ అందించగా.. అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మంచు విష్టు కూతుళ్లు పాడిన ఈ పాట సినిమాలో కీలక సందర్భంలో వస్తుందట. డా.మంచు మోహన్‌బాబు ఆశీస్సులతో అవ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కొన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించి, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. -
మంచు వారసురాళ్ల ఎంట్రీకి రంగం సిద్ధం.. లేఖ వైరల్
మంచు విష్ణు, సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు విష్ణు. ఈ మూవీతో తన కూతుళ్లు సినీరంగంలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ లేఖ వదలగా అది కాస్తా వైరల్‌గా మారింది. 'నేను ఈ సినీపరిశ్రమలోనే పుట్టాను, సినిమా సెట్స్‌లోనే పెరిగాను. ఎప్పుడూ నేను నటుడ్ని అవ్వాలనే కోరుకున్నాను, అనుకున్నది సాధించాను. ఒక నటుడి ప్రయాణం కనిపించినంత గ్లామర్‌గా ఉండదు. కానీ ఒక నటుడిగా నేను మీ నుంచి పొందే ప్రేమాభిమానాల ముందు ఈ సవాళ్లతో కూడిన ప్రయాణం కష్టమనిపించదు. ప్రతి తెలుగువాడు నా కుటుంబ సభ్యుడు. నేను ఎప్పుడూ వారికి దూరంగా లేను. ఆ కారణం చేతనే నాకు పిల్లలు పుట్టినప్పుడు మీ బ్లెస్సింగ్స్ కోసం వాళ్లను మీ ముందుకు తీసుకువచ్చాను. ఒక తండ్రిగా, నటుడిగా నా కూతురులైన అరియాన, వివియానలను గాయనీమణులుగా, నటీమణులుగా మీ ముందుకు తీసుకువస్తున్నాను. జిన్నాలో మన అరియాన, వివియాన కలిసి ఓ పాట పాడారు. దీనికి సంబంధించిన వీడియో సాంగ్ ఈ నెల 24 ఆదివారం ఉదయం 11.13 నిమిషాలకు రిలీజ్ కానుంది. వాళ్లు నటీమణులు అవ్వాలనేది నా కల. కానీ వారు ఏమార్గం ఎంచుకుంటారనేది పూర్తిగా వాళ్ల ఇష్టం' అని రాసుకొచ్చాడు. ❤️ pic.twitter.com/2o0sDdqV4p — Vishnu Manchu (@iVishnuManchu) July 20, 2022 ❤️ pic.twitter.com/FxrCFbZ9Rr — Vishnu Manchu (@iVishnuManchu) July 20, 2022 చదవండి: ఓటీటీలో వచ్చేస్తున్న ‘రాకెట్రీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. చైసామ్ మా అపార్ట్మెంట్లో ఉండేవారు, గొడవపడేవారు కాదు -
సింగర్స్‌గా మారిన మంచు విష్ణు కుమార్తెలు
హీరో విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా సింగర్స్‌గా పరిచయమవుతున్నారు. మంచు విష్ణు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డా.మంచు మోహన్‌బాబు ఆశీస్సులతో అవ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించి, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. (చదవండి: కమల్ హాసన్ నుంచి అది నేర్చుకున్నా: సాయిపల్లవి) ఈ చిత్రంలో గాలి నాగేశ్వరరావు అనే మాస్ పాత్ర చేస్తున్నారు విష్ణు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఓ పాటను అరియానా, వివియానా పాడారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాట సినిమాలో కీలక సందర్భంలో వస్తుంది. ఈ చిత్రానికి కెమెరా: ఛోటా.కె. నాయుడు, మూల కథ: జి.నాగేశ్వరరెడ్డి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4441454862.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బాలయ్య డైలాగ్ చెప్పిన మంచు వారమ్మాయిలు
టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు నటుడిగానే కాక నిర్మాతగా, వ్యాపారవేత్తగా బిజీగా ఉన్నాడు. అయితే ఎంత బిజీగా ఉన్న తన ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడే విష్ణు, తాజాగా తన కూతుళ్లతో కలిసి చేసిన ఓ ఆసక్తికర డబ్స్మాష్ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు. నందమూరి బాలకృష్ణ నటించిన శ్రీమన్నారాయణ సినిమాలోని ‘ఐయామ్ ద ట్రూత్’ డైలాగ్‌ను విష్ణు కూతుళ్లు అరియానా, వివియానాలులతో డబ్ స్మాష్ చేయించాడు విష్ణు. గతంలోనే రికార్డ్ చేసిన ఈ డబ్స్మాష్ వీడియోనే త్రోబ్యాక్ హ్యాష్ ట్యాగ్‌తో ఇప్పుడు షేర్ చేశాడు విష్ణు. టాలీవుడ్లో మంచు, నందమూరి కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి తెలిసిన విషయమే. ఎన్టీఆర్, మోహన్‌బాబుల కాలం నుంచి కొనసాగుతున్న ఈ అనుబంధాన్ని ఈ జనరేషన్‌లోనూ కంటిన్యూ చేస్తున్నారు. అందుకే మంచు ఫ్యామిలీ నిర్మించిన ఊ కొడతార ఉలిక్కి పడతారా సినిమాలో బాలయ్య కీలక పాత్రలో నటించి మెప్పించాడు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ఆచారి అమెరికాయాత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా త్వరలో రిలీజ్ అవుతోంది.ఈ సినిమాతో పాటు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఓటర్ సినిమా పనుల్లోనూ బిజీగా ఉన్నాడు మంచు విష్ణు. "I am the truth" #Ariaana #Viviana #Throwback #NBKDialogue #DubsmashFun https://t.co/NtFkcc2lqH — Vishnu Manchu (@iVishnuManchu) 10 March 2018 -
కూతుళ్లకు డ్యాన్స్ నేర్పించిన టాలీవుడ్ హీరో
హైదరాబాద్ : హీరో మంచు విష్ణు తమ కూతుళ్ల కోసం డ్యాన్స్ మాస్టర్‌గా అవతారం ఎత్తాడు. జింగ్ చిక్కు అంటూ... కూతుళ్లు అరియానా, వివియానాలతో డ్యాన్స్ చేయించాడు. దగ్గరుండి మరీ వాళ్లిద్దరికీ స్టెప్స్ నేర్పించాడు. ఈ సందర్భంగా నాన్నా ఏ స్టెప్పులు వేయాలంటూ....కూతురు అడిగిన ప్రశ్నకు విష్ణు.... ఏదో ఒక స్టెప్ వేయవే అంటూ సలహా ఇచ్చాడు. కాళ్లు చేతులు ఆడిస్తూ ఎలా డ్యాన్స్ చేయాలో స్వయంగా విష్ణు తన కూతుళ్లకు నేర్పించాడు. వాళ్లతో కలిసి అతడు ఉత్సాహంగా స్టెప్స్ వేశాడు. 23 సెకన్ల నిడివిగా ఉన్న ఈ వీడియో యూట్యూబ్‌లో పోస్ట్ అయింది. -
కూతుళ్లకు డ్యాన్స్ నేర్పించిన టాలీవుడ్ హీరో