Watch: Manchu Ariana And Viviana Ginna Movie Friendship Song Released, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Ginna Friendship Song: మంచు విష్ణు కూతుళ్లు ఆలపించిన తొలి పాట విన్నారా?

Published Sun, Jul 24 2022 12:21 PM | Last Updated on Sun, Jul 24 2022 12:52 PM

Manchu Ariana, Viviana First Song Out From Ginna Movie - Sakshi

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సన్నీ లియోన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఓ పాటను మంచు విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా పాడారు.  తాజాగా చిత్ర యూనిట్‌ ఆ పాటని విడుదల చేశారు. 

(చదవండి: ‘రుద్రమదేవి’ బాలనటి ఇప్పుడేం చేస్తుందో తెలుసా?)

‘ఇది స్నేహం’ అంటూ సాగే ఈ పాటకు భాస్కర పట్ల లిరిక్స్‌ అందించగా.. అనూప్‌ రూబెన్స్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.   మంచు విష్టు కూతుళ్లు పాడిన ఈ పాట సినిమాలో కీలక సందర్భంలో వస్తుందట. డా.మంచు మోహన్‌బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కొన వెంకట్‌ కథ, స్క్రీన్‌ ప్లే అందించి, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement